New Rule For Pension : కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కొత్త రూల్
New Rule For Pension : కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ విషయమై ప్రభుత్వం కొత్త రూల్ ను తీసుకొచ్చింది. ఇప్పుడు తమ పెన్షన్ పొందేందుకు పెన్షన్ ఫారమ్ 6-Aని పూరించాలి. ఈ ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో పూరించడానికి ఏకైక మార్గం భవిష్య లేదా e-HRMS 2.0 పోర్టల్ ను సందర్శించాల్సి ఉంటుంది.
పెన్షన్ విధానాలపై కొత్త నిబంధన నవంబర్ 6, 2024 నుండి అమలులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు సమర్పించిన దరఖాస్తుల హార్డ్ కాపీలు ఇకపై ఆమోదించబడవు. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ పెన్షన్, పెన్షనర్స్ సంక్షేమ శాఖ తాజా సమాచారంతో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పెన్షన్ దరఖాస్తు ఫారమ్‌లు గతంలో కాగితంపై పూర్తి చేసేవారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నుంచి పదవీ విరమణ చేసే ఉద్యోగులు తమ పెన్షన్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత...