Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: New Delhi

Waqf | వక్ఫ్ బోర్డుకే అత్యంత ప్రైవేట్ ఆస్తి ఉంది.. లెక్కలతో సహా వివరించిన కిరణ్ రిజిజు
National

Waqf | వక్ఫ్ బోర్డుకే అత్యంత ప్రైవేట్ ఆస్తి ఉంది.. లెక్కలతో సహా వివరించిన కిరణ్ రిజిజు

NewDelhi: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Parliamentary Affairs Minister Kiren Rijiju) బుధవారం లోక్‌సభ (Lok Sabha)లో వక్ఫ్ సవరణ బిల్లును (Waqf Amendment Bill) ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చను ప్రారంభించిన సందర్భంగా కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. 'ఆన్‌లైన్ మోడ్, మెమోరాండాలు, అభ్యర్థనలు, సూచనల రూపంలో మొత్తం 97,27,772 పిటిషన్లు వచ్చాయని అన్నారు. 284 ప్రతినిధులు కమిటీ ముందు తమ అభిప్రాయాలను సమర్పించి సూచనలు ఇచ్చారు. JPC (జాయింట్ పార్లమెంటరీ కమిటీ) ద్వారా లేదా నేరుగా ఇచ్చిన మెమోరాండా ద్వారా అయినా, వాటన్నింటినీ ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించింది. చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడూ ఏ బిల్లుకూ ఇంత పెద్ద సంఖ్యలో పిటిషన్లు రాలేదు. Waqf : దిమ్మదిరిగిపోయేలా గణంకాలు.. వక్ఫ్ ఆస్తి గురించి రిజిజు మాట్లాడుతూ, 'వక్ఫ్ బోర్డు (Waqf Board)కు లక్షల ఎకరాల భూమి, లక్షల కోట్ల విలువైన ఆస్తి ఉంటే, దానిని...
Trending News

Delhi News | తుగ్లక్ లైన్ నుంచి స్వామీ వివేకానంద మార్గ్ గా.. పేరుమార్చి ఎంపి

Delhi News 2025 : ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అనేక ప్రదేశాల పేర్లను మార్చాలని భావిస్తున్నది. రాజ్యసభ ఎంపీ దినేష్ శర్మ దిల్లీలోని తన ప్రభుత్వ నివాసం పేరును స్వయంగా మార్చుకున్నారు. గతంలో 6 తుగ్లక్ లేన్ అని రాసిన తన ఇంటి బోర్డును ఆయన 6 వివేకానంద మార్గ్ (Vivekananda Marg) గా మార్చారు. దినేష్ శర్మకు 6, తుగ్లక్ లేన్‌లో ప్రభుత్వ నివాసం కేటాయించారు. ఇక్కడ, అతను తన కుటుంబంతో కలిసి తన నివాసంలో గృహ ప్రవేశ వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తుగ్లక్ లైన్ నుంచి స్వామి వివేకానంద మార్గ్ గా. ఎంపి అధికారిక నివాసం నేమ్ ప్లేట్ పై 'స్వామి వివేకానంద మార్గ్' అని రాసి ఉంది. ఉత్తరప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం, రాజ్యసభ ఎంపీ దినేష్ శర్మ గురువారం (మార్చి 6) పూజాకార్యక్రమాలు నిర్వహించిన తర్వాత తన కుటుంబంతో కలిసి తన ఇంటికి వెళ్లారు...
Business

Navratna status | ఐఆర్‌సిటిసి, ఐఆర్‌ఎఫ్‌సిలకు నవరత్న హోదాకు పెంచిన కేంద్రం

Navratna status | న్యూఢిల్లీ: నికర లాభం, నికర విలువల‌ను గ‌ణ‌నీయంగా వృద్ది చేసుకుని అవసరమైన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా పెరగడంతో, కేంద్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC), ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) లను నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (CPSE) హోదాకు అప్‌గ్రేడ్ చేసింది. తాజా ప్రకటనతో IRCTC, IRFC లు CPSEలలో వరుసగా 25వ, 26వ నవరత్నాలుగా నిలిచాయి. ఇది భారత రైల్వే కంపెనీలకు ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది. Navratna status : న‌వ‌ర‌త్న హోదాతో లాభ‌మేంటి? కొత్త నవరత్న హోదాతో ఈ రెండు కంపెనీలకు ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో మరింత స్వయంప్రతిపత్తిని ల‌భిస్తుంది. ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. ఇది వారి భవిష్యత్ వృద్ధి ప్రణాళికలలో వేగంగా నిర్ణయం తీసుకోవడానికి వీలు క‌లుగుత...
Special Stories

Atal Bihari Vajpayee | వాజ్‌పేయి.. సంకీర్ణ‌పాల‌న‌లో సుస్థిర నిర్ణ‌యాలు తీసుకున్న నేత

Vajpayee 100th Birth Anniversary | అటల్ బిహారీ వాజ్‌పేయి.. భారత రాజకీయ చరిత్రలో ఓ అపూర్వ వ్య‌క్తిత్వం గ‌ల నాయ‌కుడు. ఉత్తమ కవి, మేధావి, సమర్థ రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా దేశానికి ఒక దిశ చూపిన‌ నేత‌గా గుర్తింపు పొందారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయ‌న‌ చెర‌గ‌ని ముద్రవేసుకున్నారు. మూడుసార్లు భారత ప్రధానిగా పనిచేసిన వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) దేశాభివృద్ధికి అనేక మైలురాళ్లు వేశారు. అద్భుత సంస్క‌ర‌ణ‌ల‌తో దిశానిర్దేశం చేశారు. సంప్రదాయ విలువలతో కూడిన ప్రజాస్వామ్య ఆలోచనలతో దేశానికి సేవ చేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గ్వాలియ‌ర్ (Gwalior)లో 1924 డిసెంబరు 25న‌ అటల్ బిహారీ వాజ్‌పేయి పుట్టారు. అంటే.. ఆయ‌న జ‌న్మించి నేటికి వందేళ్లు అన్న‌మాట‌. ఈ రోజు ఆయ‌న శ‌త‌జ‌యంతి ఉత్స‌వాలను దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్నాయి. అంద‌రూ మెచ్చుకొనేలా… Atal Bihari Vajpayee Birth Anniversary : 1924 డిసెంబ‌రు 25న జ‌న్మి...
National

అక్రమ బంగ్లాదేశ్ వలస విద్యార్థులను గుర్తించండి.. ఢిల్లీ పాఠశాలలకు ఆదేశాలు

Bangladeshi migrant students : అక్రమ బంగ్లాదేశ్ వలస పిల్లలను గుర్తించి, వారికి జనన ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా చూసుకోవాలని పాఠశాలలను మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ఆదేశించింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులను గుర్తించాలని ఢిల్లీ LG సెక్రటేరియట్ సూచించిన కొన్ని రోజుల తర్వాత తాజాగా ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశం ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార AAP, BJP మధ్య వాగ్యుద్ధం మొదలైంది. అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల ఆక్రమణలను తొలగించాలని పౌర సంఘం అన్ని MCD జోన్‌లను ఆదేశించింది. డిసెంబరు 31లోగా ఎంసీడీ డిప్యూటీ కమిషనర్‌ ద్వారా యాక్షన్‌ టేకప్‌ రిపోర్ట్‌ను కోరింది. "మునిసిపల్ పాఠశాలల్లో అడ్మిషన్ ఇస్తున్నప్పుడు అక్రమ బంగ్లాదేశీ (Bangladesh) వలసదారులను గుర్తించడానికి విద్యా శాఖ తగిన నివారణ చర్యలు తీసుకుంటుంది. పాఠశాలల్లో అక్రమ బంగ్లాదేశ్ వలస పిల్లలను గుర్తించడానికి సరైన గుర్తింపు, ధ...
National

పార్లమెంట్‌లో ‘Palestine’ బ్యాగ్‌ తీసుకొచ్చిన ప్రియాంకకు పాకిస్థాన్ మాజీ మంత్రి సపోర్ట్

New Delhi : భారత పార్లమెంట్‌లో పాలస్తీనా బ్యాగ్‌ (Palestine Bag) ను తీసుకెళ్లిన ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)కి పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి మద్దతు తెలిపారు. ప్రియాంక గాంధీ వాద్రా పార్లమెంటు లోపల పాలస్తీనా పేరు ఉన్న బ్యాగ్‌ను తీసుకెళ్ల‌డంపై బిజెపి విమ‌ర్శించింది. ఇది ఓటు బ్యాంకు కోసం ఒక నిర్దిష్ట వ‌ర్గాన్నిఆకర్షించేందుకే ఆమె చర్యలను పేర్కొన్న అధికార పార్టీ బిజెపి సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ‌చ్చింది. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత, పాకిస్తాన్ (Pakistan ) మాజీ మంత్రి ఫవాద్ చౌదరి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీకి మద్దతుగా నిలిచారు. పార్ల‌మెంట్ స‌మావేశంలో ప్రియాంక‌గాంధీ బ్యాగ్ తగిలించుకుని రావడం ర‌చ్చ రాజుకుంది. దాని మీద "పాలస్తీనా" అని రాసి ఉంది. పార్లమెంట్‌లో పాలస్తీనా బ్యాగ్‌తో ఉన్న ఆమెను బీజేపీ ప్రశ్నించడంతో ప్రియాంక స్పందించారు బిజెపి బుజ్జగింపు రాజ‌కీయాలు అనే ఆరోపణపై ప్రియాంక...
National

Lk Advani | ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ

LK Advani admitted to Apollo Hospital | బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ న్యూఢిల్లీ (New Delhi)లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య నిల‌క‌డ‌గా ఉందని ఆసుపత్రి అధికారులు ధృవీకరించారు. వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆయ‌న్ను అబ్జ‌ర్వేష‌న్ లోఉంచినట్లు పేర్కొన్నారు. 96 ఏళ్ల ఎల్‌కె అద్వానీ న్యూరాలజీ విభాగంలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినిత్ సూరి సంరక్షణలో ఉన్నారని వార్తా సంస్థ పిటిఐ తెలిపింది రెండు రోజుల క్రితం మాజీ ఉప ప్రధానిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. కాగాఈ ఏడాది మొద‌ట్లో కూడా అనారోగ్య కార‌ణాల వ‌ల్ల ఇదే ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స అందించారు. కాగా ప్ర‌స్తుతం ఆయ‌న ఆసుపత్రి ()లో చేరడానికి కారణం ఇంకా వెల్లడి కాలేదు. (more…)...
National

Rozgar Mela | 51,000 మంది యువ‌త‌కు అపాయింట్‌మెంట్ లెటర్లు

Rozgar Mela | దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు త‌మ‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే లక్షలాది మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంగళవారం ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్ర‌సంగించారు. ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000 మంది యువ ఉద్యోగులకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. హర్యానాలో 26,000 ఉద్యోగాలతో సహా మంగళవారం బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) పాలిత రాష్ట్రాల్లో లక్షల నియామక లేఖలు అందజేశారని ఆయన చెప్పారు. తాము అవ‌లంబిస్తున్న విధానాలు, నిర్ణయాలు ఉపాధిపై ప్రత్యక్షంగా మెరుగైన‌ ప్రభావం చూపుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, మొబైల్ టవర్లు, పారిశ్రామిక నగరాలు అభివృద్ధి చెందుతున్నాయ‌ని, కోట్లాది మందికి ఉపాధ...
National

Rail Network ట్రాక్ విద్యుదీకరణలో దూసుకుపోతున్న ఇండియ‌న్ రైల్వే..

Rail Network :  రైల్వే ట్రాక్ విస్త‌ర‌ణ‌లో భార‌తీయ రైల్వే దూసుకుపోతోంది. ఇదే విష‌య‌మై న్యూఢిల్లీలో జరిగిన అసోచామ్ (ASSOCHAM) జాతీయ సదస్సులో రైల్వే మంత్రిత్వ శాఖ వాణిజ్య విభాగం అదనపు సభ్యుడు ముకుల్ శరణ్ మాథుర్ మాట్లాడారు. రైలు విద్యుదీకరణ (Track Electrification)లో భారతదేశం ముందంజలో ఉంది. భారతదేశ రైలు నెట్‌వర్క్ ఇప్పుడు 68,000 కి.మీ విస్తరించి ఉందని, మరింత విస్తరణకు సిద్ధంగా ఉందని మాథుర్ ఉద్ఘాటించారు. రైల్వే వ్యవస్థ ప్రతిరోజూ రెండు కోట్ల మంది ప్రయాణీకులకు సేవలు అందిస్తోందని, వలస కార్మికులకు సహాయంగా ఇటీవల 5,000 ప్రత్యేక రైళ్లను నడిపిందని ఆయన గుర్తుచేశారు. భారతదేశ రైలు ఆధునికీక‌రించే య‌త్నాల్లో భాగంగా వందే భారత్ రైళ్లు ప్ర‌వేశ‌పెట్టామ‌ని ప్ర‌స్తుతం అవి విజ‌య‌వంతంగా న‌డుస్తున్నాయ‌ని తెలిపారు. టికెట్ వాపస్‌ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రైల్వే విస్తరణ కోసం భారత ప్రభుత్వం రూ.85,000 కోట్లు కేటాయించి...
Elections, National

PM Modi 3.0 | మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముహూర్తం ఖరారు

PM Modi 3.0 |  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనిద్వారా భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత దేశంలోని మొదటి ( ఏకైక) మూడు పర్యాయాలు ప్రధాని అయిన వ్యక్తి గా మోదీ (PM Modi 3.0) నిలవనున్నారు. కాగాప్రధాని మోదీ తన రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని  రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. అలాగే తన పదవికి రాజీనామాను అందజేశారు. జూన్ 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం పూర్తయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగాలని మోదీని కోరారు. 2014లో 282 సీట్లు, 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ ఈసారి 240 సీట్లు గెలుచుకుంది.  272 మెజారిటీ మార్కుకు 32 తక్కువ. ఇది ఇప్పుడు మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు కోసం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ సభ్యులు గెలుచుకున్న 53 స్థానాలపై ఆధారపడుతుంది. కాగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో త...
Exit mobile version