One Nation One Election | జమిలీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం..!
One Nation One Election | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA Governamet) ప్రభుత్వం 'ఒక దేశం, ఒకే ఎన్నికలను తన ప్రస్తుత పదవీకాలంలోనే అమలు చేసేందుకు సిద్ధమవుతోందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల సంస్కరణకు పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. మూడవ సారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజుల పాలన విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే జమిలి ఎన్నికల నిర్ణయం ఈ విడతలోనే అమల్లోకి వస్తుందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
స్వాత్యంత్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో ప్రధాని మోదీ (PM MODI ) జమిలి ఎన్నికల ఆవశ్యకత గురించి ప్రస్తావించారు. తరుచుగా జరిగే ఎన్నికలు దేశాభివృద్ధికి ఆటంకంగా మారుతుందని తెలిపారు. ఈ ముఖ్యమైన విధాన మార్పు భారతదేశం వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర ఎన్నికలను సమకాలీకరించడానికి ఉద్దేశించింది....