Nalanda University | ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నలంద విశ్వవిద్యాలయం విశిష్టతలు ఇవే..
Nalanda University | బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఉన్న నలంద యూనివర్సిటీలో కొత్త క్యాంపస్‌ను ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆవిష్కరించారు. అంతకు ముందు ప్రధాని మోదీ .. యునెస్కో వారసత్వ కట్టడమైన నలంద మహావీరను సందర్శించారు.
నలంద విశ్వవిద్యాలయానికి సంబంధించిన పురాతన శిథిలాలకు 20 కి.మీ కంటే తక్కువ దూరంలోనే ఈ కొత్త క్యాంపస్ ఉంది. ఇది UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం. ఈ పురాతన విశ్వవిద్యాలయాన్ని 427 CEలో కుమారగుప్త చక్రవర్తి స్థాపించాడు. ఎనిమిది శతాబ్దాలకుపైగా నలంద విజ్ఞాన దీవిగా వర్ధిల్లింది. ఎంతో అనుభవజ్ఞలైన వేదపండితులు ఇక్కడ బోధించేవారు. చైనా, కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, శ్రీలంక, ఆగ్నేయాసియా వంటి సుదూర ప్రాంతాల నుండి 2,000 మంది ఉపాధ్యాయులు, 10,000 మంది విద్యార్థులతో అద్భుతమైన ఈ విద్...