Metro Rail Parking Fee | మెట్రో రైల్ ప్రయాణికులకు షాక్.. వాహనాల పార్కింగ్ డబ్బులు చెల్లించాల్సిందే..
Metro Rail Parking Fee | హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభ స్టేషన్లు నాగోల్, మియాపూర్‌లో ఉచిత వాహన పార్కింగ్‌కు ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ముగింపు పలకబోతున్నది. నాగోల్ స్టేషన్‌లో ఇప్పటికే పార్కింగ్ ఫీజులను వసూలు చేయడం ప్రారంభించింది. గత బుధవారం వాహనాన్ని నిలిపేందుకు వెళ్లిన ప్రయాణికులకు రాత్రి సమయంలో అక్కడ కొత్త బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. పార్కింగ్ ఫీజులు చెల్లించాలనే బోర్డులో పేర్కొనడంతో స్టేషన్‌లో నిరసన చేపట్టారు. పార్కింగ్ వ్యవస్థల పని తీరును పరీక్షించేందుకు ట్రయల్స్ చేపట్టామని, అసౌకర్యానికి చింతిస్తున్నామని ఆ తర్వాత మెట్రో రైలు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
బైకు రూ.40, కారుకు రూ.120
నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఆగస్టు 25 నుంచి, మియాపూర్ స్టేషన్‌లో సెప్టెంబరు 1 నుంచి పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తామని ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు సంస్థ స్పష్టం చేసింది....