Brain Eating Amoeba | దేశంలో మరో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసు నమోదు..
బ్రెయిన్ ఈటింగ్ అమీబా (Brain Eating Amoeba) మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కేరళ రాష్ట్రంలోని పయ్యోలి జిల్లాలో మరో కేసును అధికారులు గుర్తించారు. తాజాగా 14 సంవత్సరాల బాలుడికి మెదడును తినేసే అమిబా సోకింది. ప్రస్తుతం అతడికి ఆస్పత్రిలో చేరి చికిత్స అందిస్తున్నారు. దీంతో కేరళలో మెదడును తినే అమీబా సోకినవారి వారి సంఖ్య 4 కు చేరింది. ఇప్పటికే ఈ వైరస్‌బారిన పడినవారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బ్రెయిన్ ఈటింగ్ అమీబియా సోకిన బాలుడు జూలై 1న ఆస్పత్రిలో చేరినపుడు ప్రాథమిక దశలోనే ఈ వ్యాధిని గుర్తించి వెంటనే చికిత్స ప్రారంభించామని డాక్టర్లు వెల్లడించారు. చికిత్స కోసం విదేశాల నుంచి మెడిసిన్స్ తెప్పిస్తున్నారు. ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నాడని డాక్టర్లు చెప్పారు.
మలప్పురం జిల్లాలో ఇటీవల ఓ ఐదేళ్ల బాలిక అమీబిక్ మెనింగో ఎన్‌సఫాలిటిస్ (మెదడు తినే అమీబా) కారణంగా మృతిచెందింది. మే...