Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Musi River

Musi River : మూసీ ప్రక్షాళనపై గ్రీన్ సిగ్నల్.. హైకోర్టు కీలక అదేశాలు..
Telangana

Musi River : మూసీ ప్రక్షాళనపై గ్రీన్ సిగ్నల్.. హైకోర్టు కీలక అదేశాలు..

Telangana High Court On Musi River : మూసీ సుందరీకరణకు అడ్డంకులు తొలగిపోయాయి. మూసీ ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లోని అక్ర‌మ‌ నిర్మాణాలను తొలగించేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అక్రమ నిర్మాణాలను తొలగించడంతోపాటు మూసీలో కలుషిత నీరు కలవకుండా క‌ట్టుదిట్ట‌మైన‌ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుందరీకరణతో ఎవరి ఆస్తులు పోతున్నాయో సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించి పేదలను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని హైకోర్టు సూచించింది. మూసీ నది ప్రక్షాళనపై కీలక మార్గదర్శకాలు ఇవీ మూసీనదీగర్భం, బఫర్‌జోన్, ఎఫ్టీఎల్​లో చట్టవిరుద్దంగా, అనుమ‌తులులేకుండా ఉన్న నివాసాలను ఖాళీ చేయించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి. మురుగునీరు, కలుషిత నీరు న‌దిలో చేర‌కుండా చర్యలు తీసుకోవాల‌ని హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో సమగ్ర సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించి మూసీ పునరుజ్జీవంతో ఆస్తులు కోల్పోయేవారికి ఆర్థిక చేయూత‌నివ్వాల‌ని వార...
Telangana

మూసీ బాధితుల కోసం రంగంలోకి  బిజెపి.. నేటి నుంచి యాక్షన్ ప్లాన్..

Hyderabad | హైడ్రా (Hydra), మూసీ కూల్చివేతల విషయంలో బాధితులకు అండగా నిలిచేందుకు  బీజేపీ రంగంలోకి దిగింది.  దీనిపై ఈరోజు కార్యాచరణ ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి (Kishan Reddy) వెల్లడించారు. మూసీ (Musi) సుందరీకరణలో భాగంగా  బాధితులైనవారి తరఫున  తమ పోరాటం ఉంటుందని తెలిపారు. బుధవారం మూసీ పరీవాహక ప్రాంతాల్లో బుధవారం కిషన్‌ ‌రెడ్డి పర్యటించారు. అంబర్‌పేట్‌, అసెంబ్లీ, ముసారాంబాగ్‌, అం‌బేడ్కర్‌ ‌నగర్‌, ‌తులసి నగర్ ‌మీదుగా కృష్ణానగర్‌ లో ఆయన పర్యటించి బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మూసీ నిర్వాసితులు కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ఎదుట తమ కష్టాలను వివరించారు. ఇళ్లు కోల్పోతే రోడ్డున పడతామని కన్నీళ్ల పర్యంతమ‌య్యారు. మీరే దిక్కంటూ బోరున విలపించారు. ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, తమను ఇక్కడ్నుంచి పంపించవద్దంటూ  కోరారు. ఎన్నో డబ్బులు ఖర్చు చేసి ఇళ్లు కట్టుకున్నామని,...
Trending News

వెన‌క్కు త‌గ్గ‌ని హైడ్రా.. మూసీ కూల్చివేతలు మ‌ళ్లీ షురూ

Musi development | హైదరాబాద్‌: మూసీ ప‌రీవాహ‌క ప్రాంతంలో కూల్చివేతలపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసినా వేసినా కాంగ్రెస్ ప్ర‌భుత్వం వెనక్కి తగ్గడంలేదు. మూసీ (Musi River) సుందరీకరణలో భాగంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు అధికారులు మ‌రోసారి రెడీ అయ్యారు. మొదటి విడతలో పునరావాస కేంద్రాలకు తరలించిన వారి ఇళ్ల‌ను ఈరోజు నేలమట్టం చేయనున్నారు. ఇప్పటికే చాదర్‌ఘాల్‌లో రెడ్ మార్క్‌ చేసిన నివాస‌ల‌ను రెవెన్యూ అధికారులు సీల్‌ వేశారు. చాదర్‌ఘాట్‌ పరిసరాల్లో 20 ఇళ్ల‌కు ఆర్బీ-ఎక్స్‌ మార్కింగ్ చేశారు. ఇక్క‌డి నిర్వాసితులను కూడా తరలించారు. మంగ‌ళ‌వారం మూసానగర్‌, రసూల్‌పుర, వినాయక్‌నగర్‌లో కూల్చివేతలను చేప‌ట్ట‌నున్నారు. మూసీకి ఇరువైపులా రివర్‌ బెడ్‌ పరిధిలో ఉన్న నిర్మాణాల సంఖ్య సుమారు 30 నుంచి 40 వేల మధ్య ఉంటుందని అధికారులు భావించారు. కానీ తాజా మ్యాప్‌ ప్రకారం రివర్‌ బెడ్ (రెడ్‌ లైన్‌) పరిధిలో వచ్చే నిర్మ...
Telangana

Double Bedroom House | వాళ్లందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు.. నేటి నుంచే ప్రక్రియ షురూ..

Double Bedroom House : హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలు, మూసీ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్న నిరు పేదలకు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మూసీ ప‌రీవాహ‌క ప్రాంతాల్లో నిర్వాసితుల‌కు డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు లేదా ప్ర‌త్యామ్నాయ మార్గాల ద్వారా అండ‌గా ఉంటామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిన్న జ‌రిగిన స‌మీక్ష స‌మావేశంలో కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. అర్హులైన పేదలను రోడ్డున పడే పరిస్థితుల‌ను తీసుకురావొద్ద‌ని సూచించారు. పేద‌ల‌కు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని లేదంటే ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలతోపాటు మూసీ పరీవాహక ప్రాంతంలో నివసించే పేదల వివరాలను సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అర్హులైన పేదలకు భరోసా కల్పించే విధంగా తప్పకుండా ప్రయత్నం చూడాల‌ని సూచించారు. ...
Telangana

Hyderabad Metro | రాష్ట్ర బ‌డ్జెట్ లో మెట్రో రైలు విస్తరణకు భారీగా నిధులు

Hyderabad Metro | హైద‌రాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఉప ముఖ్య‌మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం తెలంగాణ బడ్జెట్ 2 లక్షల 91 వేల 159 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు ఉంద‌ని భట్టి విక్రమార్క వెల్ల‌డించారు. కాగా, 2024 - 2025 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు కేటాయించిన‌ట్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్ర‌సంగంలో వెల్ల‌డించారు. . ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ( Hyderabad Metro )కు 500 కోట్ల రూపాయల కేటాయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ బడ్జెట్ లో పాతబస్తీ మెట్రో రైలు విస్తరణకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. పాతబస్తీలో మెట్రో విస్తరణకు 500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్ పోర్ట్‌ సిస్టమ్...
Exit mobile version