Saturday, March 15Thank you for visiting

Tag: Mumbai suburban railway system

local trains | స‌రికొత్త‌ ఫీచర్లతో లోకల్ రైళ్లు, త్వరలో ఈ నగరంలో 300 కి.మీ కొత్త ట్రాక్‌లు

National
Mumbai local trains : భార‌త‌దేశంలో అత్య‌ధిక జ‌నాభా గ‌ల న‌గ‌ర‌మైన ముంబైలో లోకల్ రైళ్లు నిత్యం కిక్కిరిసిపోయి ఉంటాయి. ఎన్ని లోకల్ రైళ్లు వేసినా ప్రయాణికులకు ఏమాత్రం స‌రిపోవ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ముంబై ప్రయాణికులకు భార‌తీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ముంబై నగ‌రంలో రద్దీని తగ్గించడంతోపాటు మెరుగైన లక్షణాలతో కూడిన కొత్త-డిజైన్ రైళ్లను ముంబై సబర్బన్ రైల్వే వ్యవస్థ(Mumbai suburban railway system ) లో త్వరలో చేర్చ‌నున్న‌ట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vishnav) ప్రకటించారు. ముంబైలోని సెంట్రల్ రైల్వే, వెస్ట్రన్ రైల్వే లైన్లలో ప్రస్తుతం రూ.16,400 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయని వైష్ణవ్ పేర్కొన్నారు. రెండు స్థానిక రైళ్ల మధ్య సమయ అంతరాన్ని ప్రస్తుతం 180 సెకన్లుగా తగ్గించే ప్రణాళికలు ఉన్నాయని ఆయన హైలైట్ చేశారు. ప్రయాణికుల‌ రద్దీని తగ్గించడానికి సేవల ఫ్రీక్వెన్సీని పెంచడా...
Exit mobile version