దేశంలో అత్యంత డర్టీగా ఉండే రైళ్లు ఇవేనట..!
ప్రపంచంలో అత్యంత రద్దీ గల ప్రయాణ మార్గాల్లో మొదటిది రైల్వే మార్గం. రైలు మార్గాలు దేశం లోని నలుమూలలా విస్తరించి ఉన్నాయి. దూర ప్రయాణాలకు ప్రజలు ఎక్కువగా రైళ్లనే ఎంచుకుంటారు. నిత్యం దేశ వ్యాప్తంగా వందలాది ట్రైన్లు ప్రజలకు ఎంతో విలువైన సేవలు అందిస్తున్నాయి. అయితే రైళ్లను ప్రతీరోజు క్లీన్ గా ఉంచేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాకొన్ని ట్రైన్లు మాత్రం చాలా మురికిగా ఉంటున్నాయి. రైలు కోచ్‌ల అపరిశుభ్రతపై ట్విట్టర్‌తో పాటు, రైల్ మదద్ యాప్‌లో ప్రజలు భారతీయ రైల్వేలకు ఫిర్యాదు చేస్తున్నారు. మురికిగా ఉన్న రైళ్లలో దేశ వ్యాప్తంగా 10 ఉన్నాయి. ఈ రైళ్ల గురించి తరచుగా చాలా ఫిర్యాదులు అందుతుంటాయి. ఆ ట్రైన్ల గురించి ఇపుడు తెలుసుకుందాం..
రైల్వేలోని అత్యంత మురికిగా ఉన్న రైళ్ల జాబితాలో 'సహర్స-అమృతసర్ గరీబ్ రథ్' ట్రైన్ పేరు అగ్ర స్థానంలో ఉంది. ఈ ట్రైన్ పంజాబ్ నుంచి సహర్సా వరకు ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ కోచ్ నుంచి...