Agra Viral Video | మోమోలు తీసుకురాలేదని భర్తపై.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
Agra : తనకు ఇష్టమైన ఇష్టమైన మోమోలు (Momos) తీసుకురావడం మరిచిపోతున్నాని ఓ మహిళ తన భర్త పై అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. అంతటితో ఆగకుండా ప్రతీరోజు తన కోసం మోమోలు తీసుకురావడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విస్తూపోయారు. తర్వాత తేరుకొని వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇద్దరి మధ్య రాజీ కుదుర్చారు. ఈ ఆసక్తికర సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా (Agra) జిల్లాలో జరిగింది. మల్పురాకు చెందిన ఒక మహిళకు పినహట్కు చెందిన వ్యక్తితో 8 నెలల క్రితం వివాహమైంది. అయితే ఉత్తరాదిలో బాగా పాపులర్ మోమోలు బాగా పాపులర్. అయితే సదరు మహిళకు కూడా మోమోలు చాలా ఇష్టం. పెళ్లైన కొత్తలో ఆ వ్యక్తి పని తర్వాత ఇంటికి వచ్చేముందు రోజూ భార్య కోసం మోమోలు కొని తెచ్చేవాడు.
కాగా, గత కొన్ని రోజులుగా సదరు వ్యక్తి తన భార్య కోసం మోమోలు తేవడం మరిచిపోతున్నాడు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. దీ...