Modi 3 Cabinet Ministers List | మోదీ మంత్రి వర్గంలో చేరిన సభ్యుల పూర్తి జాబితా ఇదే..
Modi 3 Cabinet Ministers List | : నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014, 2019లో మాదిరిగానే రాష్ట్రపతి భవన్ ఎదుట అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. మోదీతో పాటు, కూటమి భాగస్వామ్య సభ్యులతో సహా NDA నాయకులు కూడా కేబినెట్, మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) 240 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే, 272 పూర్తి మెజారిటీని సాధించలేకపోవడంతో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌తో కలిసి 292 సీట్లతో కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. నారా చంద్రబాబు నాయుడుకు చెందిన తెలుగుదేశం పార్టీ (టిడిపి), నితీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్), ఏక్నాథ్ షిండే శివసేన, చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ (LJP), జయంత్ చౌదరి రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) ఇతర కూటమి సభ్యుల మద్దతుతో. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రూపుదిద్దు...