PM Modi Cabinet Meeting | ప్రధాని మోదీ తొలి సంతకం ఈ ఫైల్ పైనే.. రైతులకు నిరుపేదలకు కేంద్రం గుడ్ న్యూస్..
PM Modi Cabinet Meeting | కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ (PM Modi) వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసి రికార్డు నమోదు చేశారు. ఆయనతోపాటు 72 మందితో కేంద్ర మంత్రులు ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ టీమ్ లో 30 మందికి క్యాబినెట్ మంత్రులుగా చాన్స్ లభించింది. మరో ఐదుగురిని స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా, 36 మందిని సహాయ మంత్రులుగా మంత్రివర్గం లో అవకాశం కల్పించారు. అయితే మోదీ 3.0 కేబినెట్ తొలిసారి ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో సమావేశం కానుంది.
ఈ కీలక సమావేశంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (Pradhan Mantri Awaas Yojana-Gramin) కింద 2 కోట్ల అదనపు గృహాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ పథకం కింద లబ్ధిదారులకు అందించే సాయాన్ని కూడా సు...