Elections 2024 | ఓటు వేయకుంటే కరెంట్ కట్ చేస్తా.. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు బెదిరింపులు
బెళగావి: కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగే (MLA Raju Kage) తమకు ఓటు వేయకుంటే కరెంట్ కట్ చేస్తామంటూ ప్రజలను బెదిరించారు. తమ పార్టీకి ఓటేయకుంటే మీ గ్రామానికి కరెంట్ సరఫరా చేస్తామంటూ.. హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో వెనక్కు తగ్గే చాన్సే లేదని తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. అయితే ఎమ్మెల్యే రాజు కాగే వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెళగావి జిల్లాకు చెందిన కంగ్వాడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగే తన నియోజకవర్గ పరిధిలోని జుగులాటోలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్‌కు వోటేసి, చిక్కోడి లోక్‌సభ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆదేశాలు జారీచేశారు. అలా జరగకుంటే ఏకంగా మీ గ్రామానికి కరెంట్ కట్ చేయిస్తానని హెచ్చరించారు. రాజు వ్యాఖ్యలపై బీజేపీ (BJP) మండిపడింది. కాం...