Ladakh New Districts | ఐదు జిల్లాలుగా లడఖ్ ను ఎందుకు విభజిస్తున్నారు.?
Ladakh New Districts | కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ ను త్వరలో ఐదు జిల్లాలుగా విభజించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) నిర్ణయించింది. ఈ చారిత్రాత్మక నిర్ణయంపై 'X' వేదికపై ఒక పోస్ట్‌లో కేంద్ర హోం మంత్రి మంత్రి అమిత్ షా వెల్లడించారు. లడఖ్ ను- జన్స్కార్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్‌తంగ్ అనే జిల్లాలుగా విభజిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు పరిపాలనను చేరువ చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఐదు జిల్లాలు ఏర్పడిన తర్వాత ఇప్పుడు లడఖ్‌లో లేహ్, కార్గిల్‌తో కలిపి మొత్తం ఏడు జిల్లాలు ఏర్పడతాయి. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్ ఉంది. ప్రస్తుతం, లడఖ్‌లో లేహ్, కార్గిల్ అనే రెండు జిల్లాలు ఉన్నాయి. భారతదేశంలోని అతి తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలలో ఇదీ ఒకటి. అత్యంత కష్టతరమైన కొండ ప్రాంతాలు, ప్రతికూల వాతావరణం ఇక్కడ ఉంటుంది. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం అట్టడు...