Wednesday, March 5Thank you for visiting

Tag: MIDDLE EAST TENSIONS

Israel | హిజ్బుల్లాకు ఊపిరిస‌ల‌ప‌నివ్వ‌ని ఇజ్రాయెల్ ..

World
Israel | లెబనాన్‌లో ఇరాన్-మద్దతు గల హిజ్బుల్లాపై నిర్విరామంగా దాడులు చేస్తోంది. ఈ మిలిటెంట్ గ్రూపునకు చెందిన‌ కమాండ్ సెంటర్‌లు, ఆయుధాల నిల్వ‌లు, సొరంగాలు, ఇతర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేప‌డుతోంది. ఈ పేలుళ్లు దక్షిణ బీరుట్ పరిసర ప్రాంతాలను రెండు గంటలకు ప్ర‌భావితం చేశాయి. శనివారం అర్థరాత్రి ప్రారంభమైన బాంబు దాడి ఆదివారం వరకు కొనసాగింది. బీరుట్‌లోని షియాలు అధికంగా ఉండే శివారు ప్రాంతమైన దహియేహ్‌లోని నివాసితులను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ సైనిక హెచ్చరికల నేపథ్యంలో బీరుట్, దాని శివార్లలో బలమైన పేలుళ్లు సంభవించాయి. దేశంలోని ప్రధాన విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలతో సహా బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాల్లో కనీసం ఎనిమిది దాడులు జరిగాయి. కాగా, ఈ దాడులను లెబనాన్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ "చాలా హింసాత్మకంగా" అభివర్ణించింది. ఇజ్రాయెల్ కూడా లెబనాన్‌లో తన భూ కార్యకలాపాలను తీవ్రతరం చేసింది...
Exit mobile version