Monday, March 3Thank you for visiting

Tag: MGBS

ప్ర‌యాణికుల‌కు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. హైద‌రాబాద్ శివార్ల‌లో..

Telangana
Special Buses for Dasara హైదరాబాద్ : దసరా పండుగ సందర్భంగా ప్ర‌యాణికుల ర‌ద్దీకి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) 6,000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు అక్టోబరు 1 నుంచి 15 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని, వాటిలో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని తెలిపింది. న‌గ‌ర కీల‌క ప్రాంతాల్లో ప్ర‌త్యేక బ‌స్సులు పండుగల సమయంలో ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసేందుకు హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది . MGBS , JBS, LB నగర్ , ఉప్పల్, ఆరామ్‌ఘర్, సంతోష్‌నగర్, KPHB, ఇతర ప్రాంతాల నుంచి వారి స్వస్థలాలకు వెళ్లాలనుకునే వారి కోసం ప్రత్యేక బ‌స్సులు అందుబాటులో ఉంచబడతాయి . ఐటీ కారిడార్‌ ఉద్యోగుల సౌకర్యార్థం గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ మీదుగా విజయవాడ , బెంగళూరు తదితర ప్రాంతాలకు బస్స...

Old city metro line | పాతబస్తి మెట్రో పనులు మొదలయ్యేది అప్పుడే..

Telangana
Old city metro line | హైదరాబాద్ పాతబస్తీ వాసుల చిరకాల వాంఛ అయిన మెట్రో రైలు పనుల ప్రారంభానికి మరికొద్ది రోజులు వేచి చూాడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. మెట్రో లైన్ కోసం భూసేకరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. పాతబస్తీలో  మెరుగైన ఫుట్‌పాత్‌లు, పబ్లిక్  స్థలాలు, వాహనాల కోసం తగినంత పార్కింగ్ సౌకర్యం కల్పిస్తామని మెట్రో అధికారులు తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీ మెట్రో రూట్ రూ.2,000 కోట్లతో MGBS నుంచి ఫలక్‌నుమా వరకు 5.5-కిలోమీటర్ల మేర లైన్ ను నిర్మించనున్నారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం శంకుస్థాపన చేశారు. అయితే ఈ పనులు  లోక్‌సభ ఎన్నికల తర్వాత మాత్రమే ముందుకు సాగే అవకాశం ఉంది. నాలుగు ఓవర్ హెడ్ స్టేషన్లు.. ప్రతిపాదిత రోడ్డును 100 అడుగులు లేదా 120 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. రోడ్డు విస్తరణలో  సుమారు 1,100 ఆస్తులను తొలగించాల్సి ఉంటుందని  హైదరాబాద్ మెట్రో...

Metro line in Old City: పాత‌బ‌స్తీ వాసుల‌కు గుడ్ న్యూస్‌.. మెట్రో రైలు.. కొత్త స్టేష‌న్లు ఎక్క‌డెక్క‌డంటే..

Telangana
New Metro line in Old City | పాత‌బ‌స్తీ వాసుల చిరకాల స్వ‌ప్నం నెర‌వేరేందుకు అడుగులు పడ్డాయి. ఫలక్‌నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి మార్చి 7వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 5.5 కిలోమీటర్ల మార్గంలో ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నూమా వరకు ఈ మెట్రో లైన్ నిర్మించ‌నున్నారు. దీనికి సుమారు రూ.2 వేల కోట్ల వరకు వ్య‌య‌మ‌వుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. పాతబస్తీకి మెట్రో రైలు చిర‌కాల స్వ‌ప్నం. ఎన్నో కారణాల వల్ల ఇన్ని సంవత్స‌రాలుగా అక్క‌డ‌ మెట్రో నిర్మాణం సాధ్యం కాలేదు. ఎన్నికలకు ముందే మెట్రో విస్తరణపై బీఆర్ఎస్ ప్రభుత్వం ప‌లు ప్రణాళికలను రూపొందించింది. రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టుకు లైన్‌ నిర్మించాని భావించింది. దీంతో పాతబస్తీలో ప్లాన్లు పెండింగ్ లో పడిపోయాయి. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక పాతబస్తీ మెట్రో ప్రణాళిక లో క‌ద‌లిక వ‌చ్చింది. మెట్రోలైన్ నిర్మాణంపై రేవంత్ రెడ్డి.. మజ్...

టీఎస్ ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ ఈ-గ‌రుడ బ‌స్సుల ఛార్జీలు త‌గ్గింపు..! 

Andhrapradesh
విజ‌య‌వాడ వెళ్లే ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. TSRTC E-Buses : హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడకు వెళ్లే ప్ర‌యాణికుల‌కు టీఎస్ ఆర్టీసీ శుభ‌వార్త వినిపించింది. ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ ఈ-గ‌రుడ ఎలక్ట్రిక్ బ‌స్సుల ఛార్జీల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు ఆర్టీసీ ఎం.డీ వీసీ స‌జ్జ‌నార్ వెల్లడించారు.. ప్రారంభ ఆఫ‌ర్ కింద ఈ-గ‌రుడ బ‌స్సు ఛార్జీల‌ను తగ్గించిన‌ట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఆఫ‌ర్ నెల రోజుల వ‌ర‌కు అందుబాటులో ఉంటుంద‌న్నారు. మియాపూర్ – విజ‌య‌వాడ ఛార్జీ రూ. 830 నుంచి రూ. 760కి, ఎంజీబీఎస్ – విజ‌య‌వాడ ఛార్జీ రూ. 780 నుంచి రూ. 720కి త‌గ్గించిన‌ట్లు ఆయన పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌ మియాపూర్‌లో 10 ఈ -గరుడ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలోగా హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించారు. ...
Exit mobile version