Tuesday, March 4Thank you for visiting

Tag: Metro Rail news

HYD Metro | రెండో దశ మెట్రో ప్రాజెక్టు డీపీఅర్ సిద్ధం!

Telangana
HYD Metro | హైదరాబాద్‌ మెట్రో రైల్‌ రెండో దశ పనులకు రాష్ట్ర ప్ర‌భుత్వం త్వరలోనే శ్రీకారం చుట్టనుంది. ఇందుకు సంబంధించిన ప‌నుల‌ను ఆరు కారిడార్లుగా విభజించగా.. ఐదు కారిడార్లకు డీపీఆర్‌లు రెడీ అయ్యాయ‌ని మెట్రోరైల్ ఎండి ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ - ప్రైవేట్‌ భాగస్వామ్యంతో మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ విస్తరణకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే, దేశంలోనే మూడో అతి పెద్ద మెట్రో నెట్ వ‌ర్క్ గా హైదరాబాద్‌ మెట్రో అవతరిస్తుందని ఆయ‌న తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో హైదరాబాద్‌ మెట్రో రైలు స‌క్సెస్ ఫుల్‌గా నడుస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉంద‌ని, ప్రపంచంలోనే ఏడేళ్లు పూర్తి చేసుకున్న అతి పెద్ద మెట్రో రైలు ప్రాజెక్ట్‌గా అరుదైన ఘ‌న‌త‌ను సంపాదించుకుందని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ముం...

Metro Rail Phase-2 | ఊపందుకున్న హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్ట్.. ఫైన‌ల్ డీపీఆర్ లు సిద్ధం!

Telangana
Metro Rail Phase-2 Corridors | హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్ వ‌చ్చింది. అన్ని కారిడార్‌లకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు (డిపిఆర్‌లు) పూర్తవుతున్నాయని సీనియర్ అధికారులు ఆదివారం ప్రకటించారు. దాదాపు రూ. 32,237 కోట్ల వ్యయంతో అంచనా వేసిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భాగ్య‌నగరం అంత‌టా మెట్రో క‌నెక్టివిటీని అందిస్తుంది. డీపీఆర్ పై ముఖ్యమంత్రి సమీక్ష తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇటీవల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో డిపిఆర్ తయారీపై సమీక్షించారు. ఈ సమీక్ష సందర్భంగా, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) మేనేజింగ్ డైరెక్టర్ NVS రెడ్డి ప్రాజెక్ట్ అలైన్‌మెంట్, కీలక ఫీచర్లు, స్టేషన్ స్థానాలకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను అందించారు. ఫేజ్-2 మొత్తం 116.2 కి.మ...

Double Bedroom House | వాళ్లందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు.. నేటి నుంచే ప్రక్రియ షురూ..

Telangana
Double Bedroom House : హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలు, మూసీ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్న నిరు పేదలకు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మూసీ ప‌రీవాహ‌క ప్రాంతాల్లో నిర్వాసితుల‌కు డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు లేదా ప్ర‌త్యామ్నాయ మార్గాల ద్వారా అండ‌గా ఉంటామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిన్న జ‌రిగిన స‌మీక్ష స‌మావేశంలో కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. అర్హులైన పేదలను రోడ్డున పడే పరిస్థితుల‌ను తీసుకురావొద్ద‌ని సూచించారు. పేద‌ల‌కు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని లేదంటే ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలతోపాటు మూసీ పరీవాహక ప్రాంతంలో నివసించే పేదల వివరాలను సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అర్హులైన పేదలకు భరోసా కల్పించే విధంగా తప్పకుండా ప్రయత్నం చూడాల‌ని సూచించారు. ...

Metro Rail Parking Fee | మెట్రో రైల్ ప్ర‌యాణికుల‌కు షాక్‌.. వాహ‌నాల పార్కింగ్ డ‌బ్బులు చెల్లించాల్సిందే..

Telangana
Metro Rail Parking Fee | హైద‌రాబాద్‌ మెట్రో రైలు ప్రారంభ స్టేషన్లు నాగోల్, మియాపూర్‌లో ఉచిత వాహన పార్కింగ్‌కు ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ ముగింపు ప‌ల‌కబోతున్న‌ది. నాగోల్‌ స్టేషన్‌లో ఇప్ప‌టికే పార్కింగ్‌ ఫీజుల‌ను వ‌సూలు చేయ‌డం ప్రారంభించింది. గ‌త బుధ‌వారం వాహనాన్ని నిలిపేందుకు వెళ్లిన ప్ర‌యాణికుల‌కు రాత్రి స‌మ‌యంలో అక్క‌డ కొత్త‌ బోర్డులు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. పార్కింగ్‌ ఫీజులు చెల్లించాలనే బోర్డులో పేర్కొన‌డంతో స్టేషన్‌లో నిరసన చేప‌ట్టారు. పార్కింగ్‌ వ్యవస్థల పని తీరును పరీక్షించేందుకు ట్రయల్స్‌ చేపట్టామని, అసౌకర్యానికి చింతిస్తున్నామని ఆ త‌ర్వాత‌ మెట్రో రైలు సంస్థ ఒక‌ ప్రకటనలో పేర్కొంది. బైకు రూ.40, కారుకు రూ.120 నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఆగస్టు 25 నుంచి, మియాపూర్‌ స్టేషన్‌లో సెప్టెంబరు 1 నుంచి పార్కింగ్‌ ఫీజులు వసూలు చేస్తామ‌ని ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు సంస్థ స్ప‌ష్టం చేసింది....
Exit mobile version