ప్రయాణికులకు TGSRTC గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 70 కొత్త మెట్రో డీలక్స్ బస్సులు
TGSRTC Metro Delux Bus | హైదరాబాద్: ప్రజలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రస్తుతం హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న 55 ఫ్లీట్‌కు మరో మెట్రో డీలక్స్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఉప్పల్, మెహిదీపట్నం, సికింద్రాబాద్, ఈసీఐఎల్, జగద్గిరిగుట్ట, ఎల్‌బీ నగర్ వంటి కీలక మార్గాల్లో 70 కొత్త బస్సులు సేవలందించనున్నాయి. కొత్త మెట్రో డీలక్స్ బస్సులను హైదరాబాద్ అంతటా అధిక డిమాండ్ ఉన్న రూట్లలో నడిపించనున్నారు. ఇక్కడ ఫ్రీక్వెన్సీని మెరుగుపరచడానికి బస్సులు 15-20 నిమిషాల వ్యవధిలో నడుస్తాయి. ప్రస్తుతం, ఈ RTC బస్సులు ఉప్పల్-మెహదీపట్నం, సికింద్రాబాద్-ECIL, కోఠి, అబ్దుల్లాపూర్‌మెట్‌లతో సహా ప్రధాన మార్గాలను కవర్ చేస్తాయి ఇవి నగర ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీని అందించనున్నాయి.
మహిళా ప్రయాణికులు టికెట్ చెల్లించాల్సిందే..
సెప్టెంబర్ చివరి నాటికి హైదరాబాద్‌లో క...