TGSRTC: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు రూట్లలో కొత్త బస్సు సర్వీసులు
హైదరాబాద్ లోని శివారు ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్ (Hyderbad IT Corridor)కు టీజీ ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచింది. గ్రేటర్ శివారు ప్రాంతాల నుంచి ప్రతి రోజు లక్షలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పటివరకు సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో ఎక్కువ మంది సొంత వాహనాలపైనే వస్తున్నారు. ఈ క్రమంలోనే టీజీ ఆర్టీసీ ఫోకస్ పెట్టింది. గురువారం నుంచి ఘట్‌కేసర్ (Ghatkesar), రాజేంద్రనగర్ ( Rajendranagar) ప్రాంతాల నుంచి కొండాపూర్‌కు కొత్తగా సర్వీసులను ప్రారంభించనుంది.
టీజీ ఆర్టీసీ కొత్తగా 282కే, 215 రూట్లలో ఘట్‌కేసర్, రాజేంద్రనగర్ ప్రాంతాల నుంచి కొండాపూర్(Kondapur) వెళ్లేందుకు గురువారం నుంచి కొత్తగా బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. కాచిగూడ డిపోకు చెందిన రెండు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను ఘట్‌కేసర్ నుంచి కొండాపూర్‌కు, రాజేంద్రనగర్ డిపో నుంచి రెండు ఆర్డినరీ బస్సులను 215 మా...