Manipur chargesheet : మణిపూర్ ఘటనపై సీబీఐ చార్జిషీట్ ఏడాది తర్వాత వెలుగులోకి షాకింగ్ నిజాలు
Manipur chargesheet | యావత్ దేశాన్ని కలిచివేసిన మణిపూర్ దిగ్భ్రాంతికరమైన ఘటనకు సంబంధించి దాదాపు ఏడాది తర్వాత, ఇప్పుడు మరిన్ని కలతపెట్టే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సమర్పించిన ఛార్జిషీట్‌ను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం నివేదించింది,
దాదాపు వెయ్యి మంది పురుషుల గుంపు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించే ముందు మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ జిల్లాలో కుకీ-జోమీ కమ్యూనిటీకి చెందిన వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు, ఇద్దరు బాధితురాళ్లు రోడ్డు పక్కన ఆగి ఉన్న “పోలీసు జిప్సీ లోపలికి వచ్చి కూర్చోగలిగారు”, మమ్మల్ని రక్షించండి వెంటనే వాహనాన్ని స్టార్ట్ చేయండి అని బాధితులు పోలీసులన ప్రాథేయపడ్డారు. అపుడు పోలీసు డ్రైవర్ జీపు “కీ లేదు” అని వారికి బదులిచ్చాడు అని సిబిఐ తన ఛార్జిషీట్ లో పేర్కొంది. పోలీసు జిప్సీలో మరో ఇద్దరు మగ బాధితులు కూడా కూర్చున్నారు. ద...