దసరా బంపర్ ఆఫర్.. లక్కీ డ్రా విజేతలకు గొర్రె పొట్టేలు, మేకపోతు, ఖరీదైన మద్యం బాటిళ్లు..
Dasara Lucky Draw : సాధారణంగా ఏదైనా పోటీల్లో గెలుపొందినవారికి షీల్డ్‌లు, మెడల్స్, లేదా గృహోపకరణాలను, చీరలను బహుమతులుగా ఇస్తారు. కానీ వీటన్నింటికీ భిన్నమైన బహుమతులను ఈగ్రామంలో అందజేశారు.దసరా పండుగను పురస్కరించుకుని లక్కీ డ్రాలో కొత్తగా మేకలు, కోడిమాంసం, ప్రీమియం స్కాచ్ విస్కీలను బహుమతులుగా అందజేస్తూ ఇక్కడి ఓ గ్రామం వార్తల్లో నిలిచింది. ఈ బహుమతుల కోసం రూ.100 విలువైన లాటరీ కూపన్‌ను కొనుగోలు చేస్తే చాలు.
Dasara Lucky Draw Prizes : మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అక్టోబరు 10న ఒక్కొక్కటి రూ.100 చొప్పున కూపన్‌లను విక్రయించి లక్కీ డ్రా నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే లక్కీ డ్రా గెలుచుకున్నవారికి గృహోపకరణాలు లేదా వాహనాలు, షీల్డులు, కాదు.. బోయపల్లి డ్రాలో మొదటి బహుమతి పొందిన లక్కీకి గొర్రె పొట్టేలు, రెండవ బహుమతిగా మేకపోతు. మూడు...