Monday, March 3Thank you for visiting

Tag: Mamata Banerjee

Nabanna Abhijan Rally | కోల్ కతా రేప్ కేసులో మమత రాజీనామాకు పట్టు.. విద్యార్థుల ఆందోళన.. పరిస్థితి ఉద్రిక్తం..

Trending News
Nabanna Abhijan Rally updates: మమతా బెనర్జీ రాజీనామా చేయాలని, వైద్యురాలిపై అత్యాచారం-హత్యకు పాల్పడిన వారిపై క‌ఠిన‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఛత్ర సమాజ్ 'నబన్న అభిజన్' ర్యాలీలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో యువత చేతుల్లో త్రివర్ణ పతాకాలు పట్టుకుని మ‌మ‌త ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. అత్యాచారం కేసులో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోల్‌కతాలోని వివిధ ప్రాంతాల్లో సచివాలయం వైపు కవాతు నిర్వహించారు. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అత్యాచారం-హత్య కేసుపై ఆగ్ర‌హంతో ఉన్న‌ నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఆగస్టు 9న కోల్‌కతాలోని RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం హత్యకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (BJP) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ విషయంపై ...

Sandeshkhali row : ‘మమతను అరెస్టు చేయాలి.. టిఎంసిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి.. బిజెపి నేత‌ డిమాండ్

National
Sandeshkhali row : పశ్చిమ బెంగాల్ లో ప్రతిపక్ష నాయకుడు, బిజెపి నేత సువేందు అధికారి శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సందేశ్‌ఖాలీ(Sandeshkhali) లో అధికార టీఎంసీ పార్టీని 'ఉగ్రవాద సంస్థ'గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తృణ‌మూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ పార్టీ నాయకుడు షేక్ షాజహాన్ (Sheikh Shahjahan) నివాసంలో విదేశీ రివాల్వర్‌లతో సహా అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్న తరువాత సువేందు అధికారి ఈ వ్యాఖ్య‌లు చేశారు. ప్రమాద‌క‌ర‌ ఆయుధాలు, పేలుడు పదార్థాలను దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని, షేక్ లాంటి ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న ముఖ్య‌మంత్రికి ఈ రాష్ట్రానికి సీఎంగా కొనసాగే నైతిక అధికారాన్ని కోల్పోయార‌ని అన్నారు. ''సందేశ్‌ఖాలీలో దొరికిన ఆయుధాలన్నీ విదేశాల నుంచి వ‌చ్చిన‌వే.. ఆర్డీఎక్స్ ల...

Sandeshkhali | సందేస్‌ఖాలీ దాడిలో విదేశీ పిస్టల్స్‌తో సహా భారీగా ఆయుధాలను స్వాధీనం..

Crime, National
Sandeshkhali Raids | పశ్చిమ బెంగల్ లోని సందేశ్ ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల బృందంపై జరిపిన దాడికి సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈమేరకు శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలోని రెండు స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జనవరి 5న సస్పెండ్ అయిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్ అనుచ‌రుల నుంచి ఈ ఆయుధాలు స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. కాగా సీబీఐ అధికారుల,  ఎన్‌ఎస్‌జీ కమాండోల బృందం సందేశ్‌ఖాలీకి చేరుకున్న విషయం తెలుసుకొని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్‌ఖాలీలో స్థానిక పోలీసులు, కేంద్ర బలగాల సాయంతో ఐదు బృందాలు దాడులు నిర్వహించాయని ఏజెన్సీ అధికారులు తెలిపారు. కొంద‌రు అనుమానితుల వ‌ద్ద‌ భారీగ...
Exit mobile version