Malkajgiri : శరవేగంగా మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు
Amrit Bharat Station Scheme : రైల్వే మంత్రిత్వ శాఖ అమృత్ భారత్ స్టేషన్ పథకం (ABSS) కింద 'నయ భారత్ నయ స్టేషన్' చొరవలో భాగంగా చేపట్టిన మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ (Malkajgiri railway station) పునరాభివృద్ధికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇప్పటివరకు ప్రతిపాదిత అభివృద్ధి పనులలో దాదాపు 60 శాతం పూర్తయ్యాయి. అదే సమయంలో, అన్ని పనులు వేగంగా పురోగతిలో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని రైల్వే అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. మల్కాజ్‌గిరి స్టేషన్ పునరాభివృద్ధి కోసం సుమారు రూ. 27.61 కోట్ల నిధులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ (Malkajgiri railway station) లో అభివృద్ధి పనులు పూర్తయ్యాక రైలు ప్రయాణికులకు అత్యంత ఆధునిక సౌకర్యాలు అందుబాటులో వస్తాయని దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపారు . సికింద్రాబాద్ నుండి 3 కి...