Wednesday, March 5Thank you for visiting

Tag: Mahila Shakti canteens

Warangal Ring Road | వ‌రంగ‌ల్ ఔటర్ రింగ్ రోడ్డుపై క‌ద‌లిక‌..

Telangana
Warangal Ring Road | ద‌శాబ్డాలుగా ఎదురుచూస్తున్న వ‌రంగ‌ల్ రింగ్‌రోడ్ పై ఎట్ట‌కేల‌కు క‌ద‌లిక వ‌చ్చింది. వరంగల్‌ నగర సమగ్రాభివృద్ధికి వెంట‌నే మాస్టర్‌ ప్లాన్‌-2050 ను (Warangal City Master Plan) రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన.. హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. వరంగల్‌ను వారసత్వ నగరంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు (Warangal Ring Road) కోసం భూసేకరణ పూర్తి చేయాలని, భూసేకరణకు అవసరమైన నిధులకు సంబంధించిన వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత ఔటర్‌ రింగ్‌ రోడ్డును ఒక జాతీయ రహదారిని మరో జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా అభివృద్ధి చేయాలని, ఔటర్‌ రింగ్‌ రోడ్డు ను...

Bank Loans | మహిళ‌ల‌కు గుడ్ న్యూస్‌.. మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లు

Telangana
Interest Free Bank Loans | మహిళలు తెలంగాణ ప్ర‌భుత్వం తీపి క‌బురుచెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,56, 273 సంఘాలకు రూ. 20,000.39 కోట్ల మేర వ‌డ్డీలేని రుణాలను లక్ష్యంగా నిర్ణయించింది. ఈమేర‌కు రాష్ట్ర పంచాయితీ రాజ్‌ ‌గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ- గ్రామీణాభివృద్ధి సంస్థ ఎస్‌హెచ్‌జి - బ్యాంక్‌ ‌లింకేజి వార్షిక రుణ ప్రణాళిక 2024-25 ను ఆవిష్కరించారు. బ్యాంకులు అందించే రుణాలు (Bank Loans) సద్వినియోగం చేసుకుని ఆర్థికావృద్ధి సాధించాల‌ని ఆమె ఈసంద‌ర్భంగా కోరారు. మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాల కింద 2,53,864 నిధులు, అలాగే సంఘాలకు రూ. 264.34 కోట్లు డిసెంబరు 2023 ‌నుంచి మార్చి, 2024 వరకు అడ్వాన్స్‌గా నిధులు విడుదల చేశామ‌ని మంత్రి తెలిపారు. రూ.10 ల‌క్ష‌ల ప్ర‌మాద బీమా.. స్వ‌యం స‌హాయ‌క‌ సంఘాల మహిళలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా, రూ. 2 లక్షల వరకు ...

Mahila Shakti canteens : త్వరలో మహిళా శక్తి కాంటీన్లు..

Telangana
Mahila Shakti canteens| హైదరాబాద్: వచ్చే రెండేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా కనీసం 150 'మహిళా శక్తి' క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ అవుట్‌లెట్‌లు తక్కువ ధరతో  ఆహారాన్ని అందిస్తాయి. కర్నాటకలో 'ఇందిరా క్యాంటీన్‌ల' (Indira canteens) తరహాలో ఇవి ఉంటాయి. మహిళా స్వయం సహాయక సంఘాలకు (స్వయం సహాయక బృందాలు) క్యాంటీన్లు కేటాయించనున్నారు. మహిళా సంఘాల సహకారంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 12న పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సమక్షంలో మహిళా శక్తి పాలసీ పత్రాన్ని విడుదల చేశారు. బ్యాంకుల ద్వారా లక్ష కోట్ల రుణాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్త్రీ నిధి’ కార్యక్రమాల ద్వారా వచ్చే ఐదేళ్లలో కాంగ్ర...
Exit mobile version