Sankranti Festival : సంక్రాంతి ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిట.. ప్రైవేట్ ఆపరేటర్ల దోపిడీ
Hyderabad : సంక్రాంతి వేడుకలు (Sankranti Festival) సమీపిస్తుండడంతో పండుగల వేడుకలు ఉత్సాహంగా జరుపునేందుకు హైదరాబాద్ జనమంతా తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు పయనమవుతున్నారు. విద్యాలయాలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలతో కలిసి కుటుంబసమేతంగా హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో తరలివస్తున్నారు. దీంతో అన్ని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రజలు ప్లాట్‌ఫారమ్‌లపై బస్సులు, రైళ్ల కోసం వేచిచూస్తున్నారు. కాగా జంటనగరాల్లో అతిపెద్ద రైల్వేస్టేషన్‌గా గుర్తింపు పొందిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పండుగ రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) సంక్రాంతి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 100 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.. ఎందుకంటే వేలాది మంది ప్రయాణికులు వారి లగేజీతో పాటు సికింద్రాబాద్ స్టేషన్‌న...