Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Maharashtra

RSS | సేవ ఎక్కడ అవసరమైతే అక్కడ స్వచ్ఛంద సేవకులు ఉంటారు…’
National

RSS | సేవ ఎక్కడ అవసరమైతే అక్కడ స్వచ్ఛంద సేవకులు ఉంటారు…’

దేశ అజరామర సంస్కృతికి మహావృక్షం ఆర్ఎస్ఎస్ నాగ్ పూర్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ Nagpur : రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (RSS)ను దేశ అజరామర సంస్కృతికి మహావృక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు.ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ (Keshav Baliram Hedgewar) జయంతిని పురస్కరించుకొని ఆదివారం ప్రధాని మోదీ తొలిసారిగా నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్‌ భగవత్‌ పక్కనే నిలబడి ప్రసంగించిన మోదీ (PM Modi).. సామాజిక సేవ కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ అంకితభావంతో పనిచేస్తోందని కొనియాడారు. వరదలు, భూకంపాలు, ఇటీవల జరిగిన మహా కుంభమేళాలో వారి నిస్వార్థ సేవ స్పష్టంగా కనిపించిందని ప్రధానమంత్రి అన్నారు. సేవ ఉన్న చోటల్లా స్వచ్ఛంద సేవకులు ఉంటారని ఆయన అన్నారు. మహా కుంభమేళా అయినా...
Crime

Nagpur Violence : నాగ్‌పూర్‌లోని మహల్, భల్దార్‌పురా, హంసపురిలో హింసకు కారణమేమిటి?

Nagpur Violence News Updates : నాగ్‌పూర్‌లో ఉద్రిక్తతలు చెలరేగాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘర్షణలు, విధ్వంసం, దహనకాండకు దారితీసింది. నిరసనతో ప్రారంభమైన ఘటనలు రెండు గ్రూపుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణకు దారితీసింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని నిషేధాజ్ఞలు విధించారు. అల్లర్లకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. రాజకీయ నేతలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నాగ్‌పూర్ బిజెపి సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)కి నిలయం, అందువల్ల శాంతిని కాపాడటానికి ప్రభుత్వం తీసుకునే చర్యపై అందరి దృష్టి ఉంటుంది. మహారాష్ట్ర (Maharastra)లో ఔరంగజేబు సమాధిని తొలగించాలనే డిమాండ్‌ ఇటీవల కాలంలో ఉధృతం కావడంతో రెండు గ్రూపుల మధ్య ఘర్షణలకు దారితీసింది. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 163 కింద నాగ్‌పూర్ నగరంలోని అనేక ప్రాంతాల్లో కర్...
National

Aurangzeb : ఔరంగజేబ్‌ను పొడిగిడినందుకు స‌మాజ్ వాదీ పార్టీ నేత‌పై కేసు

అత్యంత క్రూరుడైన‌ మొఘల్ పాలకుడు ఔరంగజేబును (Aurangzeb) ప్రశంసిస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు మహారాష్ట్ర సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అబు అజ్మీ చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో, శివసేన (షిండే వర్గం) ఆయనపై పోలీసు ఫిర్యాదు చేసింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే కూడా అజ్మీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శివసేన ఫిర్యాదు శివసేన (షిండే వర్గం) అబూ అజ్మీపై ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మాజీ ఎమ్మెల్యే, శివసేన అధికార ప్రతినిధి కిరణ్ పవాస్కర్, పార్టీ కార్యకర్తలతో కలిసి ఎస్పీ నాయకుడిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. ఆయనపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని పార్టీ పిలుపునిచ్చింది. అలాగే, శివసేన ఎంపీ నరేష్ మష్కే BNS సెక్షన్లు 299, 302, 356 (1), మరియు 356(2) కింద ప్రత్యేక...
Trending News

‘లవ్ జిహాద్’ కు వ్యతిరేకంగా చట్టాలు? మ‌హారాష్ట్ర‌లో ఏడుగురు సభ్యుల ప్యానెల్ ఏర్పాటు

Mumbai: మ‌హారాష్ట్ర‌ (Maharashtra)లోని మ‌హాయుతి ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. బలవంతపు మత మార్పిడులు, "లవ్ జిహాద్ (Love Jihad)" కేసులకు వ్యతిరేకంగా చట్టపరమైన చట్రాన్ని పరిశీలించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) సంజయ్ వర్మ నేతృత్వంలోని ఈ కమిటీలో స్త్రీ, శిశు సంక్షేమం, మైనారిటీ వ్యవహారాలు, న్యాయవ్యవస్థ (law and judiciary), సామాజిక న్యాయం (సోష‌ల్ జ‌స్టిస్‌), హోం శాఖ‌ వంటి కీలక విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు ఈ క‌మిటీలో ఉంటారు. శుక్రవారం ఆలస్యంగా జారీ చేసిన ప్రభుత్వ తీర్మానం ప్రకారం, ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేస్తుంది. "లవ్ జిహాద్‌", బలవంతపు మతమార్పిడుల ఫిర్యాదులను పరిష్కరించడానికి చర్యలను సూచిస్తుంది. ఈ కమిటీ చట్టపరమైన అంశాలను, ఇతర రాష్ట్రాల్లో రూపొందించిన చట్టాలను కూడా...
Elections

Maharashtra CM | మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎంపికపై ఏక్ నాథ్ కీలక ప్రకటన

Maharashtra CM : ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం రోజుల తర్వాత మహారాష్ట్ర సీఎం పీఠం ఎవరిదనే అంశంపై స్పష్టత వచ్చింది. 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకునేందుకు సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నిర్ణయాన్ని వాయిదా వేయడం ద్వారా షిండే ఎమోషనల్ మైండ్ గేమ్ ఆడినట్లు తెలుస్తోంది. తాను ప్రధానమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, ప్రభుత్వ ఏర్పాటుకు "అడ్డంకి" కాబోనని ఏక్ నాథ్ షిండే ప్రకటించారు. కాగా మహారాష్ట్ర సీఎం ఎంపికలో ఏర్పడిన ప్రతిష్టంభనను పరిష్కరించే బాధ్యతను మోదీ.. అమిత్ షాకు అప్పగించారు. ముగ్గురు మహాయుతి నాయకులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేలతో  అమిత్ షా  సమావేశమయ్యారు. అయితే ఇక్కడ షిండే "సానుకూలంగా" ఉన్నప్పటికీ  ఆమర అసంతృప్తితో ఉన్నారని పలు వర్గాలు వెల్లడించాయి. తన బేరసారాల వ్యూహాలు విఫలమయ్యాయని గ్రహించిన షిండే, సిఎం, క్యాబినెట్ మ...
Elections

మ‌హా ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూప‌లేకపోయిన రాజ్‌థాక్రే, ప్రకాశ్ అంబేద్క‌ర్ పార్టీలు

Maharashtra Assembly Elections : మహారాష్ట్ర ఎన్నిక‌ల్లో రాజ్ థాకరే కు చెందిన‌ మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీ (MNS), అంబేద్క‌ర్ మ‌న‌వ‌డు ప్రకాష్ అంబేద్కర్ కు చెందిన వంచిత్ బహుజన్ అఘాడి (VBA) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ఈ పార్టీలో మ‌హాయుతి సూనామీ ముందు కొట్టుకుపోయాయి. అయితే సమాజ్ వాదీ పార్టీ, ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ వంటి పార్టీలు కాస్త మెరుగైన స్థితిలో ఉన్నాయి. MNS 125 మంది అభ్యర్థులను నిలబెట్టగా, VBA 200 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. ముంబయిలోని మహిమ్‌ సీటులో పార్టీ అధినేత కుమారుడు అమిత్‌ థాకరే మూడో స్థానంలో నిలవడం ఎంఎన్‌ఎస్‌కు మింగుడు ప‌డ‌లేదు.. 19 మంది అభ్యర్థులను నిలబెట్టిన రాజు శెట్టి నేతృత్వంలోని స్వాభిమాని పక్ష (Swabhimani Paksha) కూడా ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్రలో రైతులపై ప్రభావం చూపుతున్నట్లు తెలిసింది. యాదృచ్ఛికంగా, ఓట్ల ల...
Elections

నాందేడ్ లో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ‌.. బిజెపికి పెరిగిన సంఖ్యాబ‌లం

Nanded Constituency | నాందేడ్ లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో బిజెపి పార్లమెంట్ స‌భ్యుల‌ సంఖ్యను 241కి పెంచుకుంది. బిజెపి అభ్యర్థి సంతుక్రావ్ హంబార్డే భారీ ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. ఎన్నికల సంఘం తాజా లెక్కల ప్రకారం కాంగ్రెస్‌ ప్రత్యర్థి రవీంద్ర చవాన్‌పై దాదాపు 40,000 ఓట్లు వచ్చాయి. ఐదు నెల‌ల క్రితం నాందేడ్‌లో కాంగ్రెస్ 50,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో బీజేపీపై విజయం సాధించించింది. అయితే ఆగస్టు 26న కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ వసంత్ చవాన్ మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గాన్ని నిలుపుకునే ప్రయత్నంలో వసంత్ కుమారుడు రవీంద్ర చవాన్‌ను కాంగ్రెస్ రంగంలోకి దింపింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 23 నుంచి 9 స్థానాలకు పడిపోయిన మహారాష్ట్రలో బీజేపీ గెలుపు పునరుజ్జీవనాన్ని సూచిస్తుంది. నాందేడ్ తిరిగి కైవ‌సం చేసుకోవ‌డంతో కాషాయ పార్టీ ఇప్పుడు మ‌హా...
Trending News

Adani group | ఒకవైపు అదానీపై రాహుల్ గాంధీ విమర్శలు.. మరోవైపు తెలంగాణలో అదానీ గ్రూప్ తో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందాలు..

Adani group | న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ(Goutham Adani)  పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పిలుపునివ్వడంతో తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని ఇరకాటంలో పడేట్లు అయింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలపై USలో అభియోగాలు మోపబడిన తర్వాత అతనిపై చర్య తీసుకోవాలని గాంధీ డిమాండ్‌ చేసిన విష‌యం తెలిసిందే.. అయితే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అదానీ గ్రూప్ నుంచి విరాళాలు స్వీకరించిన వార్త‌లు అదానీ గ్రూప్ తో తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందాల‌కు సంబంధించిన వార్త‌లు ట్రెండింగ్ లోకి వ‌చ్చాయి. రాహుల్ గాంధీ ఏం చెప్పారు? భారతీయ అధికారులకు USD 250 మిలియన్ల లంచం ఇచ్చినందుకు US ప్రాసిక్యూటర్లు అదానీ, ఆయ‌న‌ సహచరులపై అభియోగాలు మోపిన విష‌యంపై రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో ప్ర‌స్తావించారు. గౌత‌మ్ అదానీ.. భారత్‌, అమెరికన్ చట్ట...
Elections

Maharashtra Exit Poll : మహారాష్ట్రలో మళ్లీ మహాయుతికే పట్టం.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవే..

Maharashtra Exit Poll : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, మహారాష్ట్రలో మరోసారి మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 137-157 సీట్లు వస్తాయని అంచనా వేయగా, మహా వికాస్ అఘాడికి 126-146 సీట్లు రావచ్చు. ఇతరులు 2-8 సీట్లు సాధించ‌వ‌చ్చ‌ని అంచ‌నావేసింది. MATRIZE ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, మహాయుతి మరోసారి మెజారిటీతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. MATRIZE ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 150-170 సీట్లు వస్తాయని అంచనా వేయగా, మహా వికాస్ అఘాడికి 110-130 సీట్లు రావచ్చు. ఇతరులకు 8-10 సీట్లు రావచ్చు. పీపుల్స్ పల్స్: మహాయుతి (BJP+): 182 మహా వికాస్ అఘాడి (కాంగ్రెస్+): 97 ఇతరులు: 9  మెట్రిజ్: మహాయుతి (BJP+): 150-170 ...
Elections

Maharashtra Elections | మహావికాస్ అఘాడీ గెలిస్తే కాంగ్రెస్‌కు మహారాష్ట్ర ఏటీఎం అవుతుంది: అమిత్ షా

Maharashtra Elections : నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (MVA) గెలిస్తే ఈ రాష్ట్రం కూడా కాంగ్రెస్‌కు ‘ఏటీఎం’గా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith Shah) విమ‌ర్శించారు. రాష్ట్ర వనరులను ఉపయోగించి మహారాష్ట్ర నుంచి డబ్బు వసూలు చేస్తారు మీ డబ్బును ఢిల్లీకి పంపుతారు" అని బుధ‌వారం జల్గావ్ జిల్లాలోని చాలీస్‌గావ్‌లో జరిగిన ర్యాలీలో అమిత్‌ షా అన్నారు. బిజెపి (BJP)నేతృత్వంలోని మహాయ‌తి కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంద‌ని, జార్ఖండ్‌లోనూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆయన అన్నారు మహారాష్ట్రలో మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అందుకే కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని అమిత్ షా అన్నారు. పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అదే రాజ్యాంగం న‌కిలీ కాపీని పట్టుకొని వ‌చ్చార‌ని, కొందరు జర్నలిస్...
Exit mobile version