Friday, March 7Thank you for visiting

Tag: Maharashtr

Train Derailment | రైలు ప్రమాదానికి మరో కుట్ర.. ట్రాక్ పై సిమెంటు దిమ్మెలు.. సోలాపూర్‌ వద్ద తప్పిన ప్రమాదం

National
Train Derailment | దేశంలో రైలు ప్రమాదాలు జ‌రిగేందుకు కుట్రపూరిత యత్నాలు ఇటీవ‌ల పెరిగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో దుండగులు రైలు ప్రమాదాలకు కుట్ర ప‌న్నిన‌ సంఘ‌ట‌న‌లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మహారాష్ట్రలో ఇదే త‌ర‌హా ఘ‌ట‌న జ‌రిగింది. సోలాపూర్‌ (Solapur) మార్గంలోని రైలు పట్టాలపై దుండగులు పెద్ద సిమెంట్‌ దిమ్మెను పెట్టారు. దానిని గమనించిన లోకో పైలట్ వెంట‌నే స్పందించి రైలు ఢీ కొట్టకుండా తప్పించాడు. లోకో పైలట్‌ సమయస్పూర్తితో పెను ప్రమాదం తప్పింది. విష‌యం తెలుసుకున్న అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో..  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఆదివారం భివాండి-ప్రయాగ్‌రాజ్‌ కాళింది ఎక్స్‌ప్రెస్‌కు కాన్పూర్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. రైలుప‌ట్టాల‌పై కొంద‌రు దుండ‌గులు గ్యాస్‌ సిలిండర్‌ను ఉంచారు. లోకో పైలెట్ గ‌మ‌నించి ఎమ‌ర్జెన్సీ బ్రే...
Exit mobile version