Subsidy Gas Cylinder : సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు ఏడాదికి ఎన్ని ఇస్తారో తెలుసా.. ?
Mahalaxmi Scheme Subsidy Gas Cylinder : తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇటీవలే రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఇప్పటికే అర్హుల జాబితాను కూడా రూపొందించింది. ఏడాదికి ఎవరికి ఎన్ని సిలిండర్లు ఇవ్వాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేసింది. రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులైన వారి మూడు సంవత్సరాల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఏడాదికి ఇవ్వాల్సిన గరిష్ట సిలిండర్ల సంఖ్య ఎనిమిదిగా నిర్ధారించింది.
అయితే ఈ పథకానికి మొదట 39.78 లక్షల మందిని అర్హులుగా తేల్చగా.. తర్వాత ఆ సంఖ్య 39.50 లక్షలకు తగ్గింది. ఇది మరింత తగ్గవచ్చని సమాచారం. అర్హులైన వారిలో దాదాపు 9.10 లక్షల మంది అత్యధికంగా ఏటా 8 గ్యాస్ సిలిండర్లు చొప్పున వినియోగిస్తారని అధికారులు గుర్తించారు. దీంతో ఈ పథకం కింద సబ్సిడీపై ఇవ్వబోయే...