Mahakumbh 2025 : మహా కుంభమేళాలో రంగంలోకి దిగిన 15,000 మందికి పైగా పారిశుధ్య కార్మికులు
Mahakumbh 2025 : మహాకుంభ్ నగర్‌లో త్రివేణి సంగమం ప్రాంతాలను పరిశుభ్రం చేయడానికి యూపీ ప్రభుత్వం భారీ శానిసేషన్ డ్రైవ్ ప్రారంభించింది. ఇందులో భాగంగా 15,000 మందికి పైగా పారిశుధ్య కార్మికులు రంగంలోకి దించింది. మహాకుంభ్ నగర్ ను నాలుగు వేర్వేరు జోన్‌లుగా విభజించి ఏకకాలంలో క్లీనింగ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
Mahakumbh 2025 : గిన్నిస్ బుక్ లో నమోదు
సోమవారం (జనవరి 24) మధ్యాహ్నం 12 గంటలకు ప్రయాగ్‌రాజ్ మేళా అథారిటీ ద్వారా మొత్తం 4 జోన్లలో 15,000 మందికి పైగా పారిశుధ్య కార్మికులు ఏకకాలంలో శుభ్రతా డ్రైవ్ నిర్వహిస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ఒక రికార్డు అని చెప్పవచ్చు. ఇంత భారీ సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులు ఒకేసారి ఒక ప్రాంతంలో పనిచేడయం జరగలేదు. ఇది 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో నమోదు చేయనున్నట్లు తెలిసింది.
ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ...