Maharashtra Exit Poll : మహారాష్ట్రలో మళ్లీ మహాయుతికే పట్టం.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవే..
Maharashtra Exit Poll : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, మహారాష్ట్రలో మరోసారి మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 137-157 సీట్లు వస్తాయని అంచనా వేయగా, మహా వికాస్ అఘాడికి 126-146 సీట్లు రావచ్చు. ఇతరులు 2-8 సీట్లు సాధించవచ్చని అంచనావేసింది.
MATRIZE ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, మహాయుతి మరోసారి మెజారిటీతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. MATRIZE ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 150-170 సీట్లు వస్తాయని అంచనా వేయగా, మహా వికాస్ అఘాడికి 110-130 సీట్లు రావచ్చు. ఇతరులకు 8-10 సీట్లు రావచ్చు.
పీపుల్స్ పల్స్:
మహాయుతి (BJP+): 182
మహా వికాస్ అఘాడి (కాంగ్రెస్+): 97
ఇతరులు: 9
మెట్రిజ్:
మహాయుతి (BJP+): 150-170
...