Saturday, March 15Thank you for visiting

Tag: madhyapradesh govt provide EVs

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బంపర్ ఆఫర్

National
మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 12వ తరగతిలో ప్రతిభ కనబరిచిన 9,000 మంది విద్యార్థినీ విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలను అందజేస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఇందుకోసం 2023-24 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వానికి రూ.135 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ప్రతిభ కనబరిచిన బాలికలకు మాత్రమే ఈ-బైక్‌లను మొదట ప్రకటించింది. అయితే ఆ తర్వాత బాలురకు కూడా ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. “ఇ-స్కూటీ విద్యార్థులను వారి ఇళ్ల నుంచి కళాశాలలకు వచ్చిపోయేందుకు వీలుగా ఉంటుందని మిశ్రా తెలిపారు. దీంతో పాటు, SC / ST విద్యార్థుల స్కాలర్‌షిప్ కోసం ఆదాయ పరిమితిని రూ.6 లక్షల నుండి రూ.8 లక్షలకు పెంచే ప్రతిపాదన ఆమోదించబడి...
Exit mobile version