Thursday, June 19Thank you for visiting

Tag: madhapur

దూకుడు పెంచనున్న హైడ్రా.. తర్వాత లక్ష్యం అవే..

Telangana
Hydra Pilot Project :  రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వచ్చే ఆరునెలల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు చెరువులను సుందరీకరణ చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది.   హైడ్రా ఒకవైపు ప్రభుత్వ భూములను కాపాడుతూనే మరోవైపు చెరువులను సుందరీకరణ చేయాలని నిర్ణయించుకుంది.  హైదరాబాద్ మహానగర పరిధిలో చెరువుల పూర్వభవం కోసం  పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలని భావిస్తోంది. తొలివిడతగా నాలుగు చెరువుల సుందరీకరణ చేయాలని అది కూడా  ఆరు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. వాటిలో  బాచుపల్లి- ఎర్రగుంట చెరువు, మాదాపూర్- సున్నం చెరువు, కూకట్‌పల్లి-నల్లచెరువు, రాజేంద్రనగర్- అప్పచెరువును హైడ్రా ఎంపిక చేసింది. హైదరాబాద్ లో  తూర్పు, దక్షిణ, ఉత్తరం, పశ్చిమ వైపులా ఒక్కో చెరువును ఎంపిక చేసుకుంది. తొలుత చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో మార్కింగ్ పూర్తి చేయనుంది. ఇందుకు నెలరోజుల సమయం కేటాయించనుంది. తర్వాత చెరువుల చుట్టూ ...

N Convention | నాగార్జునకు ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

Trending News
Telangana | హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ (HYDRA) అధికారులు శనివారం ప్రముఖ‌ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna)కు చెందిన మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ (N Convention ) సెంటర్‌ను కూల్చివేశారు. తమ్మిడి కుంట సరస్సులోని ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) పరిధిలో దీనిని నిర్మించినట్లు ఆరోపణలు వచ్చాయి. "హైడ్రా అధికారులు ఉదయమే ఎన్ కన్వెన్షన్ హాల్‌ను కూల్చివేయడం ప్రారంభించారు. కూల్చివేత సజావుగా జరిగేలా మేము పోలీసు బలగాలను మోహరించాము, ఈ భూమి ఎఫ్‌టిఎల్ జోన్‌లోకి వస్తుంది" అని మాదాపూర్ డిసిపి తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న నాగార్జున ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ ను కూల్చివేసే ముందు తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని తెలిపారు. అంతేకాకుండా కేసు కోర్టులో ఉండ‌గా ఇలా అర్ధంతరంగా కూల్చివేయడం స‌మంజ‌సం కాద‌న్నారు. చెరువు భూమికి ఒక్క అంగుళం కూడా అక్రమించలేదని స్ప‌ష్టం...
Exit mobile version