Metro Phase – 2 | హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2 విస్తరణలో కొత్త రూట్లు ఇవే..
Metro Phase - 2 | హైదరాబాద్‌లో ట్రాఫిక్ చిక్కులతో నిత్యం సతమతమవుతున్న ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని పెంపొందించే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణ కోసం కొత్త మార్గాల ఖరారుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II విస్తరణ కొత్త మార్గాలు ఈ వ్యూహాత్మక విస్తరణ హైదరాబాద్‌లోని మెజారిటీ ప్రయాణికులకు మెట్రో రైల్ సేవలను అందించడంతోపాటు నగరం నాలుగు మూలల నుంచి విమానాశ్రయాన్ని కనెక్ట్ చేయడం లక్ష్యంగా పెట్టున్నారు.
గత ప్రతిపాదనలు రద్దు..
గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రైల్ మార్గాలను రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నగర జనాభాలో ఎక్కువ మంది ప్రజల అవసరాలను తీర్చాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ప్రత్యామ్నాయ మార్గాల నెట్‌వర్క్‌ను సిద్ధం చేయనుంది. కేంద్ర ప్రభుత్వంతో జాయింట్ వెంచర్ 15 శాతం, ర...