Tuesday, March 4Thank you for visiting

Tag: Love Jihad

‘లవ్ జిహాద్’ కు వ్యతిరేకంగా చట్టాలు? మ‌హారాష్ట్ర‌లో ఏడుగురు సభ్యుల ప్యానెల్ ఏర్పాటు

Trending News
Mumbai: మ‌హారాష్ట్ర‌ (Maharashtra)లోని మ‌హాయుతి ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. బలవంతపు మత మార్పిడులు, "లవ్ జిహాద్ (Love Jihad)" కేసులకు వ్యతిరేకంగా చట్టపరమైన చట్రాన్ని పరిశీలించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) సంజయ్ వర్మ నేతృత్వంలోని ఈ కమిటీలో స్త్రీ, శిశు సంక్షేమం, మైనారిటీ వ్యవహారాలు, న్యాయవ్యవస్థ (law and judiciary), సామాజిక న్యాయం (సోష‌ల్ జ‌స్టిస్‌), హోం శాఖ‌ వంటి కీలక విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు ఈ క‌మిటీలో ఉంటారు. శుక్రవారం ఆలస్యంగా జారీ చేసిన ప్రభుత్వ తీర్మానం ప్రకారం, ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేస్తుంది. "లవ్ జిహాద్‌", బలవంతపు మతమార్పిడుల ఫిర్యాదులను పరిష్కరించడానికి చర్యలను సూచిస్తుంది. ఈ కమిటీ చట్టపరమైన అంశాలను, ఇతర రాష్ట్రాల్లో రూపొందించిన చట్టాలను కూడా...
Exit mobile version