LokSabha Elections | ఇద్దరు భార్యలుంటే రూ.2 లక్షలు ఇస్తారట.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వివాదాస్పద హామీపై విమర్శలు
LokSabha Elections 2024 | లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కొందరు రాజకీయ నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చిత్రవిచిత్రమైన హామీలను గుప్పిస్తున్నారు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో ఓ కాంగ్రెస్ (Congress) ఎంపీ అభ్యర్థి ఏకంగా ఇద్దరు భార్యలకు స్కీమ్ ప్రకటించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలువురు ఆయన తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
కేంద్ర మాజీ మంత్రి, రత్లాం (Ratlam) కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కాంతిలాల్ బహురియా(Kantilal Bhuria) సైలనాలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో వస్తే మహాలక్ష్మీ పథకం కింద ఇచ్చే రూ.లక్షలు ఇస్తామని, ఒకవేళ పురుషులకు ఇద్దరు భార్యలుంటే ఆ ఇద్దరికీ రూ.లక్ష చొప్పున అందజేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆయనవ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కాంతిలాల్ కామెంట్స్ పై అధికార బీజేపీ ((BJ...