BJP Manifesto | రేపే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల.. ఏయే హామీలు ఉండనున్నాయి..?
BJP Manifesto | న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల (Lok Sabha polls) కోలాహలం నెలకొంది. ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ ముచ్చటగా మూడోసారి మరోసారి అధికారంలోకి వచ్చేస్తామని ధీమాగా ఉంది. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ అలుపు దేశవ్యాప్తంగా రోడ్‌షోలు, సభలు నిర్వహిస్తున్నారు. ఈ పదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో (BJP Manifesto) ను ఆదివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో విడుదల చేయనుంది.
సంకల్ప పాత్ర పేరుతో భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల కోసం మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేయనుంది. రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ప్రజల అభిప్రాయాలు సేకరించిన తర్వాత మేనిఫెస్టోను సిద్ధం చేసింది. ప్రధా...