పశ్చిమ బెంగాల్ టీఎంసీ కుంభకోణాలపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
PM Narendra Modi | బీజేపీ లోక్‌సభ అభ్యర్థులు ఖగెన్ ముర్ము, శ్రీరూపా మిత్ర చౌదరికి మద్దతుగా మాల్దా పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వం యువకుల జీవితాలతో ఆడుకుంది. భారీ రిక్రూట్‌మెంట్ స్కామ్‌తో దాదాపు 26,000 మంది జీవనోపాధి కోల్పోయారు. అని అన్నారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్-2016 (ఎస్‌ఎల్‌ఎస్‌టి) రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా 25,753 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేయాలని కలకత్తా హైకోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే.. రిక్రూట్ అయిన వారిలో ఒక వర్గం వారు తీసుకున్న జీతాలను 12 శాతం వార్షిక వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
మొదట లెఫ్ట్ ఫ్రంట్, ఆ తర్వాత టీఎంసీ బెంగాల్ అభివృద్ధిని అడ్డుకున్నాయి. టిఎంసి పాలనలో బెంగాల్‌లో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుత...