Monday, March 3Thank you for visiting

Tag: lok sabha Elections 2024

PM Modi 3.0 | మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముహూర్తం ఖరారు

Elections, National
PM Modi 3.0 |  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనిద్వారా భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత దేశంలోని మొదటి ( ఏకైక) మూడు పర్యాయాలు ప్రధాని అయిన వ్యక్తి గా మోదీ (PM Modi 3.0) నిలవనున్నారు. కాగాప్రధాని మోదీ తన రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని  రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. అలాగే తన పదవికి రాజీనామాను అందజేశారు. జూన్ 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం పూర్తయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగాలని మోదీని కోరారు. 2014లో 282 సీట్లు, 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ ఈసారి 240 సీట్లు గెలుచుకుంది.  272 మెజారిటీ మార్కుకు 32 తక్కువ. ఇది ఇప్పుడు మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు కోసం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ సభ్యులు గెలుచుకున్న 53 స్థానాలపై ఆధారపడుతుంది. కాగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో త...

Lok Sabha election 2024 results : జూన్ 4న ECI వెబ్‌సైట్‌లో పోల్ ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?

Elections
How to check poll results on ECI website | యావ‌త్ భార‌తదేశం ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌రికొద్ది గంట‌ల్లో ప్రారంభం కానుంది. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌తోపాటు ఇత‌ర‌ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల కౌంటింగ్ జూన్ 4 ఉదయం 8 గంటలకు మొద‌ల‌వుతుంది. ఓట్ల లెక్కింపు కోసం  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విస్తృత ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఓటరు తమ తమ నియోజకవర్గాల్లోని ఫలితాలపై అప్‌డేట్‌గా ఉండటానికి అనేక మార్గాలు ఉన్నాయి. Lok Sabha election 2024 results : 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏడు దశల పోలింగ్ జూన్ 1న‌, శనివారం ముగిసింది, ఫలితాలు మంగళవారం జూన్ 4న ప్రకటించనున్నారు. ఎన్నికల్లో భాగంగా మొద‌టి ద‌శ పోలింగ్‌ ఏప్రిల్ ...

Phase 7 Elections Key candidates లోక్ సభ ఎన్నికల ఫేజ్ 7: కీలక అభ్యర్థులు, నియోజకవర్గాల జాబితా..

Elections
Lok Sabha Election 2024 (Key candidates) :  లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఏడవ, చివరి విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. 57 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ , హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, చండీగఢ్ కేంద్ర పాలిత నియోజకవర్గాలు ఏడో దశ ఎన్నికల బరిలో ఉన్నాయి. ఏడవ దశలో పోలింగ్ జరిగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 1) బీహార్: 40 సీట్లలో 8 2) హిమాచల్ ప్రదేశ్: 4 3) జార్ఖండ్: 14 నియోజకవర్గాలలో 3 4) ఒడిశా: 21 స్థానాలకు 6 5) పంజాబ్: 13 సీట్లలో 13 6) ఉత్తరప్రదేశ్: 80 నియోజకవర్గాలలో 13 7) పశ్చిమ బెంగాల్: 42 స్థానాలకు 9 8) చండీగఢ్: 1 రాష్ట్రాల వారీగా ఏడో దశ నియోజకవర్గాల జాబితా: 1) బీహార్ నలంద (జ‌న‌ర‌ల్ ) పాట్నా సాహిబ్(జ‌న‌ర‌ల్ ) పాటలీపుత్ర (జ‌న‌ర‌ల్) అర్రా (జ‌న‌ర‌ల్) బక్సర్ (జ‌న‌ర‌ల్) ససారం (SC) కరకత్ (జ‌న‌ర‌ల్) జహనాబాద్ (జ‌న‌ర‌ల...

BJP on Reservation | కాంగ్రెస్ ను ఇరుకునపెట్టేలా బీజేపీ తాజా ప్రకటన..

Elections
BJP on Reservation | అనేక సందర్భాల్లో రిజర్వేషన్ల (Reservation) ను పునర్విభజన చేయాలనే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాన్ని బీజేపీ తన తాజా ప్రకటన ద్వారా బహిర్గతం చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల 7వ, చివరి దశకు దేశం సిద్ధమవుతున్న వేళ, భారతీయ జనతా పార్టీ (బిజెపి) బుధవారం #MeraVoteMeraAdhikar అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఒక వీడియో ప్రకటనను విడుదల చేసింది. అందులో రిజ‌ర్వేష‌న్ల పున‌ర్విభ‌జ‌న‌పై కాంగ్రెస్ ఉద్దేశాన్ని బట్టబయలు చేయడానికి ప్రయత్నించింది. 'మైనారిటీ' వర్గాలను సంతృప్తి పరచడానికి మన దళిత, గిరిజన, వెనుకబడిన, అత్యంత వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను త‌గ్గించిన విష‌యాన్ని ఆ ప్ర‌క‌ట‌న‌లో ప్ర‌స్తావించింది. . BJP on Reservation : 48 సెకన్ల నిడివి గ‌ల‌ వీడియోలో, SC/ST/OBC రిజర్వేషన్ల గురించి అట్టడుగు వర్గాల్లో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ మాస్ హిస్టీరియా సృష్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎలా మార్చి...

Lok Sabha Elections 2024 : రేపటి పోలింగ్ లో తెలుగు రాష్ట్రాల్లో కీలక పోరు ఈ నియోజకవర్గాల్లోనే..

Elections
Key Candidates in AP-Telangana : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన నాలుగో దశ ఓటింగ్ మే 13, సోమవారం జరుగుతుంది. నాలుగో విడ‌త‌లో పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప‌రిధిలోని 96 నియోజకవర్గాల్లో ఎన్నికలు (Lok Sabha Elections 2024 ) జ‌ర‌గ‌నున్నాయి.  ఈ దశలో, 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 96 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్ (25), బీహార్ (5), జమ్మూ కాశ్మీర్ (1), జార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), తెలంగాణ (17) , ఉత్తర ప్రదేశ్ (13), పశ్చిమ బెంగాల్ (8) పోలింగ్ నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్: అరకు (ఎస్టీ), శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం (ఎస్సీ), రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల (ఎస్సీ), ఒంగోలు, నంద్యాల, కర్నూలు, నెల్లూరు, తిరుపతి...

Lok Sabha Elections Phase 4 | నాలుగో ద‌శ ఎన్నిక‌లు.. 96 నియోజ‌క‌వ‌ర్గాలు, కీలక అభ్యర్థుల వివరాలు ఇవే..

Elections
Lok Sabha Elections Phase 4 | లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా వ‌రుస‌గా ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7న మూడు ద‌శ‌ల్లో పోలింగ్ విజ‌య‌వంతంగా పూర్త‌యిన త‌ర్వాత ఇపుడు నాలుగో దశకు అంతా సిద్ధమైంది. నాలుగో విడ‌త లోక్‌సభ ఎన్నికలు మే 13న సోమ‌వారం జరగనున్నాయి. ఈ ద‌ఫా 10 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతం ప‌రిధిలోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వంటి కొన్ని ప్రధాన రాష్ట్రాలు ఉన్నాయి. ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. నాలుగో దశ ఎన్నికల్లో నియోజకవర్గాలు ఈ దశలో, 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 96 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్ (25), బీహార్ (5), జమ్మూ కాశ్మీర్ (1), జార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), తెలంగ...

lok sabha elections 2024 | అమేథీలో 26 ఏళ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తిపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్

Elections
Amethi | ఉత్తరప్రదేశ్‌లోని 2019లో బీజేపీ చేతతో ఓడిపోయే వ‌ర‌కు గాంధీ కుటుంబానికి బలమైన కంచుకోటగా అమేథీ ఉండేది. చేజారిపోయిన అమేథీని తిరిగి పొందేందుకు రాహుల్ గాంధీ మ‌రోసారి పోటీ చేస్తార‌ని ఆయన మద్దతుదారులు ఊహించగా, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం గాంధీయేతర వ్య‌క్తిని ఎంచుకుంది. గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన కిషోర్‌ లాల్ శర్మ ఈసారి అమేథీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మూడు దశాబ్దాలలో కనీసం నలుగురు గాంధీ కుటుంబ సభ్యులు వేర్వేరు సమయాల్లో పోటీ చేయ‌గా 26 సంవత్స‌రాల తర్వాత రెండవ గాంధీయేతర కాంగ్రెస్ అభ్యర్థిగా కిశోర్ లాల్ శ‌ర్మ నిలిచారు. ఈ స్థానం నుంచి గాంధీయేతర అభ్యర్థి సతీష్ శర్మ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యతో ఖాళీ అయిన తర్వాత రెండుసార్లు విజయం సాధించారు. కానీ 1998 ఎన్నికల్లో ఓటమి చ‌విచూశారు. కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మక పోరు అమేథీ (Amethi) కాంగ్రెస్‌కు లోక్‌సభ నియోజకవర్గం ఎంతో ప...

Lok Sabha elections 2024: వారణాసిలో ప్రధాని మోదీపై పోటీ చేస్తున్నహాస్యనటుడు శ్యామ్ రంగీలా ఎవరు?

Elections
Shyam Rangeela | ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ వీడియోలు చేసి పాపుల‌ర్ అయిన హాస్యనటుడు శ్యామ్ రంగీలా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానిపై వారణాసి స్థానం నుంచి పోటీ చేస్తానని వెల్ల‌డించారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గానికి జూన్ 1న లోక్‌సభ ఎన్నికల్లో ఏడవ దశలో ఓటింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. రంగీలా లోక్‌సభ 2024కి వారణాసి నుంచి పోటీ చేయ‌నున్న‌ట్లు బుధవారం సోషల్ మీడియాలో ప్రకటించారు . కాగా 2014, 2019లో రెండుసార్లు ఈ సీటును గెలుచుకున్న మోదీ , మే 13న వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. శ్యామ్ రంగీలా ఎవరు? రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో పుట్టి పెరిగిన రంగీలా (Shyam Rangeela) యానిమేషన్ కోర్సు పూర్తిచేశారు. రంగీలా తన మిమిక్రీ తో బాగా పాల‌పుల‌ర్ అయ్యారు. ముఖ్యంగా రాజకీయ ప్రముఖులను మిమిక్రీ చేస్తూ . 'ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్'లో తన ప్రదర్శనలతో క...

Third Phase Voting : మూడో దశలో 1,352 మంది అభ్యర్థుల్లో 392 మంది ‘కోటీశ్వరులు.. 8 శాతం మందిపై క్రిమినల్ కేసులు

Elections
Third Phase Voting : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మూడో దశలో 1,352 మంది అభ్యర్థులు బ‌రిలో నిలిచారు. వీరిలో 29 శాతం అంటే 392 మంది 'కోటీశ్వరులే..! ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తులు రూ. 5.66 కోట్లు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR), షనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్ర‌కారం.. మూడవ దశలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల్లో మొదటి ముగ్గురు అభ్యర్థులు, వారి ప్రకటించిన ఆస్తుల ఆధారంగా, వందల కోట్ల సంపదను కలిగి ఉన్నారు. అత్యధికంగా ప్రకటించిన ఆస్తులు రూ. 1,361 కోట్లు దాటాయి. కాగా మే 7న మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి . ADR నివేదిక ప్రకారం.. మూడవ దశ లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తున్న 1,352 మంది అభ్యర్థులలో కేవ‌లం 123 మంది (9 శాతం ) మాత్రమే మహిళలు ఉన్నారు. 18 శాతం మందిపై క్రిమినల్ కేసులు లోక్‌సభ ఎన్నికల మూడో విడత (Third Phase Voting ) లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 18 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటిం...
Exit mobile version