Model Code of Conduct | మోడల్ ఆఫ్ కండక్ట్ అంటే ఏమిటీ..
Election code : లోక్‌సభ ఎన్నికలనగారా మోగింది. లోక్ సభతోపాటు ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంగఫ షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ అమల్లోకి వచ్చింది. పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఈసీ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. MCC నిబంధనలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్ని రాజకీయ పార్టీలను కోరారు.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏమిటి?
What is Model Code of Conduct : ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు జరిగేందుకు ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలను రూపొందించింది. ఈ నిబంధనల సమాహారాన్నే ‘‘మోడల్ ఆఫ్ కండక్ట్’’ అని అంటారు. ఈ నిబంధనలను రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఏదైనా రాజకీయ పార్టీగానీ అభ్యర్థి గానీ ఈ ఎన్నికల ప్రవర్...