Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: LOK SABHA ELECTION

లోక్‌సభ ఎన్నికల్లో  121 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులు. 647 మంది 8వ తరగతి ఉత్తీర్ణులు.. నివేదికలో ఆసక్తికర అంశాలు
Elections

లోక్‌సభ ఎన్నికల్లో 121 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులు. 647 మంది 8వ తరగతి ఉత్తీర్ణులు.. నివేదికలో ఆసక్తికర అంశాలు

2024 Lok Sabha Election | న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 121 మంది అభ్యర్థులు తాము నిరక్షరాస్యులని ప్రకటించుకోగా, 359 మంది 5వ తరగతి వరకు చదువుకున్నారని ఏడీఆర్ నివేదికలు (ADR Election Data) వెల్ల‌డిస్తున్నాయి. ఇంకా 647 మంది అభ్యర్థులు 8వ తరగతి వరకు చ‌దివిన‌ట్లు డేటా సూచిస్తోంది. దాదాపు 1,303 మంది అభ్యర్థులు 12వ తరగతి ఉత్తీర్ణులయ్యారని, 1,502 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్నారని ప్రకటించారు. ఇదే విశ్లేషణ ప్రకారం డాక్టరేట్ పొందిన అభ్యర్థులు 198 మంది ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 8,360 మంది అభ్యర్థుల్లో 8,337 మంది విద్యార్హతలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషించింది. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి.. మొదటి దశలో.. 26 మంది నిరక్షరాస్యులు.. మొదటి దశ ఎన్నికలలో, 639 మంది అభ్యర్థులు తమ విద్యార్హతలను 5వ నుంచి 12వ తరగతుల మధ్య ఉన్నారని నివేదిం...
Elections

Third Phase Voting : మూడో దశలో 1,352 మంది అభ్యర్థుల్లో 392 మంది ‘కోటీశ్వరులు.. 8 శాతం మందిపై క్రిమినల్ కేసులు

Third Phase Voting : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మూడో దశలో 1,352 మంది అభ్యర్థులు బ‌రిలో నిలిచారు. వీరిలో 29 శాతం అంటే 392 మంది 'కోటీశ్వరులే..! ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తులు రూ. 5.66 కోట్లు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR), షనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్ర‌కారం.. మూడవ దశలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల్లో మొదటి ముగ్గురు అభ్యర్థులు, వారి ప్రకటించిన ఆస్తుల ఆధారంగా, వందల కోట్ల సంపదను కలిగి ఉన్నారు. అత్యధికంగా ప్రకటించిన ఆస్తులు రూ. 1,361 కోట్లు దాటాయి. కాగా మే 7న మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి . ADR నివేదిక ప్రకారం.. మూడవ దశ లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తున్న 1,352 మంది అభ్యర్థులలో కేవ‌లం 123 మంది (9 శాతం ) మాత్రమే మహిళలు ఉన్నారు. 18 శాతం మందిపై క్రిమినల్ కేసులు లోక్‌సభ ఎన్నికల మూడో విడత (Third Phase Voting ) లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 18 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటిం...
Elections

Elections 2024 : మీ ఓటర్ స్లిప్ ను ఆన్ లైన్ లో డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

Lok Sabha Elections 2024 Voter Slip : దేశంలో సాధారణ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న ముగియ‌గా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో (UTs) 88 స్థానాలకు రెండవ దశలో ఏప్రిల్ 26, శుక్రవారం పోలింగ్ జ‌రుగుతోంది. ప్ర‌జ‌లు ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డానికి వారి ఓటరు ID కార్డులతో పాటు వారి ఓటరు స్లిప్పులను వెంట ఉంచుకోవాలి. ఓటర్ స్లిప్ (Voter Slip) అంటే ఏమిటి? ఓటర్ స్లిప్ అనేది తన ఓటు వేసేందుకు అర్హ‌తను నిర్ధారిస్తుంది. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో ఉన్న‌ట్లు చెప్పడానికి ఒక రకమైన రుజువు. ఓట‌ర్‌ స్లిప్‌లో ఓటరు పేరు, చిరునామా, ప్రాంతం, బూత్ సమాచారంతోపాటు ఇతర వివరాలతో సహా సమాచారం ఉంటుంది. ఓటరు ఓటు వేయడానికి ముందు వారి నియమించబడిన పోలింగ్ బూత్‌లో మొదటి పోలింగ్ అధికారికి స్లిప్‌ను సమర్పించాల్సి ఉంటుంది. పోలింగ్ అధికారి ఓటరు స్లిప్‌లో పేర్కొన్న సమాచారాన్ని ఎలక్టోరల్ రోల్...
Elections

Lok Sabha Elections 2024: పోలింగ్ బూత్‌లోకి మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లొచ్చా? ఎన్నారైల‌కు ఓటు హ‌క్కు ఉంటుందా?

Lok Sabha Elections : లోక్‌సభ మొద‌టి ద‌శ‌ ఎన్నికలు రేపు ప్రారంభం కానుండగా, ప్రజల నుంచి అనేక సందేహాలు త‌లెత్తుతున్నాయి. పోలింగ్ బూత్‌లోకి తమ మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లవచ్చా లేదా అనేది చాలా మంది ఓటర్ల కు డౌట్ వ‌స్తుంటుంది. ఒక ఫోన్ల గురించే కాకుండా ప‌లు కీలకమైన ప్రశ్నల‌కు ఈ క‌థ‌నంలో స‌మాధానాలను తెలుసుకోవ‌చ్చు.. పోలింగ్ బూత్‌లలోకి మొబైల్ ఫోన్‌లను అనుమతిస్తారా? ఎన్నికల ప్రక్రియలో న్యాయబద్ధత, సమగ్రతను కాపాడేందుకు ఎన్నికల సమయంలో ఓటర్లు తమ మొబైల్ ఫోన్‌లను పోలింగ్ స్టేషన్‌ల లోపలికి తీసుకెళ్లడానికి ఎలాంటి అనుమ‌తి లేదు. ఎలక్ట్రానిక్ పరికరాలను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్ల‌డానికి వీలు లేదు. ఓటర్లు తమ ఓటును స్వేచ్ఛగా వేసే వాతావరణాన్ని సృష్టించేందుకు ఎన్నికల సంఘం అనేక నిబంధ‌న‌లు రూపొందించింది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకారం, ఓటర్లు పోలింగ్ స్టేషన్‌లోకి మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ...
Elections

Lok Sabha Elections Key contests : మొద‌టి ద‌శ పోలింగ్‌ ప్రారంభం.. 102 సెగ్మెంట్ల‌లో ప్రముఖుల జాబితా ఇదే..

Lok Sabha Elections Key contests 2024 |  18వ లోక్‌సభ ఎన్నికల 2024 మొదటి దశ ఏప్రిల్ 19న శుక్రవారం న జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ నియోజకవర్గాల ఓటర్లు పాల్గొంటారు. తమిళనాడులో మొత్తం 39, రాజస్థాన్‌లో 12, ​​ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, అస్సాంలలో ఒక్కొక్కటి 5, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్‌లో 2 చొప్పున‌, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, జమ్మూ కాశ్మీర్‌లలో ఒక్కో స్థానానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అన్ని సీట్ల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. తమిళనాడులో.. Lok Sabha Elections Key contests | తొలి దశ ఎన్నికల పోరులో పలువురు కీలక అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అందులో ముఖ్యంగా తమిళనాడులో ద్...
National

India TV poll : ఇండియా టీవీ పోల్ సర్వే.. తెలంగాణలో కాంగ్రెస్ ఆధిక్యం, బీజేపీ, బీఆర్ ఎస్ కు వచ్చే సీట్లు ఇవే..   

India TV poll :   ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారం..  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతుందని వెల్లడించింది. ఈ పార్టీకి  తొమ్మిది సీట్లు వస్తాయని అంచనా వేయగా, భారతీయ జనతా పార్టీ (BJP) ఐదు స్థానాలను కైవసం చేసుకుంటుందని ఇటీవల ఇండియా టివి-సిఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారం బిఆర్‌ఎస్ (BRS) రెండు స్థానాలను కైవసం చేసుకోగా, అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) కి కేవలం ఒక సీటు మాత్రమే దక్కే అవకాశం ఉంది. కాగా India TV poll ప్రకారం..  కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్‌లో బీజేపీకి చెందిన బండి సంజయ్ కుమార్, ధర్మపురి అరవింద్, జి కిషన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఒవైసీ హైదరాబాద్‌లో ముందంజలో ఉన్నందున, ఒపీనియన్ పోల్ ప్రకారం, ఎఐఎంఐఎం తన సాంప్రదాయ నియోజకవర్గాన్ని నిలుపుకోవచ్చు. 2019 ఎన్నికల్లో ఇలా.. 2019 లోక్‌సభ...
Exit mobile version