Monday, March 3Thank you for visiting

Tag: LOK SABHA ELECTION 2024

Lok Sabha Election 2024 : 3వ దశ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ షురూ.. 12 రాష్ట్రాలు.. 94 సెగ్మెంట్లు..

National
Lok Sabha Election 2024 : మే 7న 12 రాష్ట్రాల్లోని 94 నియోజక వర్గాల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల మూడో దశ నామినేషన్ ప్రక్రియ ఏప్రిల్ 12, 2024 శుక్రవారం ప్రారంభమైంది. మూడో ద‌శలో భాగంగా అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, దాద్రా & నగర్ హవేలీ, డామన్ - డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూ & కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, నామినేష‌న్ దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 19, 2024. నామినేషన్ల పరిశీలన తేదీ ఏప్రిల్ 20. అభ్యర్థులు త‌మ నామినేష‌న్ల‌ ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 22గా నిర్ణ‌యించింది. 18వ లోక్‌సభను ఎన్నుకునేందుకు ఏడు దశల ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. Lok Sabha Election 2024 : ఫేజ్ 3 షెడ్యూల్ ఇదే.. ప్రకటన & ప్రెస్ న...

Congress Jana Jathara | మహిళలకు ఏటా లక్ష రూపాయిలు నేరుగా బ్యాంకులో జమ

National, Telangana
Congress Jana Jathara  తెలంగాణలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. తుక్కుగూడ (Tukkuguda Sabha) సభావేదికగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇంటెలిజెన్స్, పోలీసు విభాగాలను దుర్వినియోగం చేసి వేలాది మంది ఫోన్లను ట్యాప్ చేసిందన్నారు. ప్రభుత్వం మారగానే ఆ డేటాను పూర్తిగా ధ్వంసం చేశారని, తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి ఎలాంటి పనిచేశారో.. దిల్లీలో ప్రధానమంత్రి మోదీ కూడా అదే పనిచేస్తున్నారని విమర్శించారు. బీజేపీ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ఓ వాషింగ్ మిషన్ ఉందని, దేశంలో అత్యంత అవినీతిపరులు మోదీతో ఉన్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘంలోనూ మోదీ తొత్తులున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మహిళలకు ఏటా లక్ష! తుక్కుగూడ (Congress Jana Jathara) సభ లో రాహుల్ గాంధీ మహిళలకు కీలక హామీ ఇచ్చారు. మహిళలకు ఏటా లక్ష రూపాయిలు నేరుగా బ్యాంకులో జమ చేస్తామని తెలిపారు. అలాగే యువత...

India TV poll : ఇండియా టీవీ పోల్ సర్వే.. తెలంగాణలో కాంగ్రెస్ ఆధిక్యం, బీజేపీ, బీఆర్ ఎస్ కు వచ్చే సీట్లు ఇవే..   

National
India TV poll :   ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారం..  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతుందని వెల్లడించింది. ఈ పార్టీకి  తొమ్మిది సీట్లు వస్తాయని అంచనా వేయగా, భారతీయ జనతా పార్టీ (BJP) ఐదు స్థానాలను కైవసం చేసుకుంటుందని ఇటీవల ఇండియా టివి-సిఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారం బిఆర్‌ఎస్ (BRS) రెండు స్థానాలను కైవసం చేసుకోగా, అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) కి కేవలం ఒక సీటు మాత్రమే దక్కే అవకాశం ఉంది. కాగా India TV poll ప్రకారం..  కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్‌లో బీజేపీకి చెందిన బండి సంజయ్ కుమార్, ధర్మపురి అరవింద్, జి కిషన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఒవైసీ హైదరాబాద్‌లో ముందంజలో ఉన్నందున, ఒపీనియన్ పోల్ ప్రకారం, ఎఐఎంఐఎం తన సాంప్రదాయ నియోజకవర్గాన్ని నిలుపుకోవచ్చు. 2019 ఎన్నికల్లో ఇలా.. 2019 లోక్‌సభ...

India TV-CNX Opinion Poll : ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏకు ‘400’ సీట్లు రావు.. ఇండియా టీవీ సర్వేలో సంచనల విషయాలు..

National
India TV-CNX Opinion Poll: లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha elections 2024) సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి మూడవసారి విజయ పరంపరను కొనసాగిస్తుందని ప్రీ-పోల్ సర్వే అంచనా వేసింది. తాజాగా ఇండియా టివి-సిఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ ( India TV-CNX Opinion Poll) ప్రకారం, రాబోయే ఎన్నికల్లో 543 లోక్‌సభ స్థానాల్లో ఎన్‌డిఎ 399 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ (BJP) ఒక్కటే 342 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేసింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని భారత కూటమి (తృణమూల్ కాంగ్రెస్ కాకుండా ) 94 సీట్లు గెలుచుకోగా, తృణమూల్ కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, బీజేడీ, స్వతంత్రులు మిగిలిన 50 సీట్లు గెలుచుకోవచ్చని అభిప్రాయ సేకరణ అంచనాలు చెబుతున్నాయి. ఇండియా TV-CNX ఒపీనియన్ పోల్: సర్వే ప్రకారం, భారతీయ జనతా పార్టీ (BJP) 342 స్థానాల...
Exit mobile version