Baramulla : ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన ఆర్మీ
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా (Baramulla ) జిల్లాలోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి బుధవారం మరో చొరబాటు ప్రయత్నం విఫలమైందని భారత సైన్యం ధృవీకరించింది. మంగళవారం పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత ఉత్తరాది రాష్ట్రాలలో భద్రత మరింత పెంచారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపారు. చొరబాటుదారుల వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ చొరబాటు ప్రయత్నం విఫలమైంది, ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యం ముసుగులో దాటడానికి ప్రయత్నించారు.
అధికారిక ప్రకటన ప్రకారం, ఏప్రిల్ 23 ఉదయం ఉత్తర కాశ్మీర్‌లోని ఉరి నాలా సమీపంలోని సర్జీవన్ ప్రాంతం గుండా ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు చొరబడటానికి యత్నించారు. "నియంత్రణ రేఖ వద్ద అప్రమత్తంగా ఉన్న దళాలు చొరబాటు గ్రూపును అడ్డుకున్నాయి, ఫలితంగా కాల్పులు జరిగాయి" అని సైన్యం తెలిపింది. ఆపరేషన్ కొనసాగుతోంది, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
పహ...