ప్రపంచ వేదికలపై ప్రధాని మోదీకి అంతర్జాతీయ అవార్డుల వెల్లువ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జూలై 13న (స్థానిక కాలమానం ప్రకారం) 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్', పురస్కారాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేతులమీదుగా అందుకున్నారు. ఇది అత్యున్నత ఫ్రెంచ్ గౌరవం.
గడచిన తొమ్మిదేళ్ల పదవీకాలంలో ప్రధాని మోదీకి అనేక దేశాలు అత్యున్నత పౌర పురస్కారాలను అందించాయి. 2014లో ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచ దేశాలు ఆయనకు ప్రదానం చేసిన 14వ అత్యున్నత రాష్ట్ర గౌరవం ఇది. ఈ గుర్తింపులు ప్రధాని మోదీ నాయకత్వం.. ప్రపంచ వేదికపై భారతదేశాన్ని బలంగా నిలబెట్టిన ఆయన దార్శనికతకు ఇది ప్రతిబింబంగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో భారతదేశం యొక్క పెరుగుతున్న సంబంధాలను కూడా ఇది చాటుతుంది.
ప్రధాని మోదీకి లభించిన అవార్డులను ఒకసారి చూద్దాం:
జూన్ 2023లో ప్రెసిడెంట్ అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి ప్రధాని మోదీకి ఈజిప్ట్ యొక్క అత్యున్నత రాష్ట్ర ...