Lava Agni 3: రెండు డిస్‌ప్లేతో తక్కువ బడ్జెట్‌లోనే లావా స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు,. ధరెంతంటే?
Lava Agni 3 Price : దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీ లావా.. తక్కువ బడ్జెట్‌లో అత్యాధునిక ఫీచర్లతో కొత్త ఫోన్లను విడుదల చేసింది. అయితే ఈసారి సాధారణ ఫోన్ కాదు. ఇది వెరైటీగా తాజాగా సెకండరీ డిస్‌ప్లేతో కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి పరిచయం చేసింది. లావా అగ్ని 3 పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను శుక్రవారం రిలీజ్ చేసింది. ఇదివరకు అగ్ని 2 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయగా ఇప్పుడు దాని కొనసాగింపుగా అగ్ని 3ని తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, AMOLED డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.
లావా అగ్ని 3 ధర..
Lava Agni 3 Price లావా ఈ ఫోన్‌ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999. అయితే, కంపెనీ ఈ ఫోన్ తో ఛార్జర్‌ను అందించడంలేదు. కస్టొమర్లు దీన్ని ఛార్జర్‌తో కొనుగోలు చేయాలనుకుంటే అదనంగా రూ. 2,000 చెల్లించాల్సిందే. ఫోన్‌తో పాటు 66W ఛార్జర్ అందుబాటులో ఉంటుంది....