Caste Census Report : కులగణన సర్వే లెక్కలు తేలాయి.. తెలంగాణలో బీసీలు 46.25 శాతం , ముస్లింలు 12.56 శాతం
Caste Census Report details | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనపై హైదరాబాద్‌లోని సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ (Cabinet Sub-Committee) సమావేశం ఆదివారం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీకి కులగణన నివేదికను ప్లానింగ్ కమిషన్ అధికారులు అందజేశారు. ఈసందర్భంగా మంత్రి ఉత్తమ్ రాష్ట్రంలో జరిగిన కుల గణన వివరాలు మీడియాకు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తగా 96.9 శాతం కులగణన సర్వే జరిగిందని, 3.1 శాతం మంది కులగణన సర్వేలో పాల్గొనలేదని తెలిపారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసమే సర్వే నిర్వహించామన్నారు. ఫిబ్రవరి 4వ తేదీన ఉదయం 10 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అదేరోజు కేబినెట్ ముందుకు కులగణన సర్వే నివేదిక తీసుకువస్తామని తెలిపారు. తెలంగాణలోని ఇంటింటా 96.9 శాతం సర్వే (Caste Census Re...