Chandipura Virus | చండీపూరా వైరస్ కలకలం.. ఈ మహమ్మారి బారిన పడి 16 మంది మృతి
Chandipura Virus : గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 50కి పైగా చండీపురా వైరస్ కేసులు నమోదయ్యాయని, అనుమానిత వైరస్ కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారని గుజరాత్ ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ తెలిపారు. హిమ్మత్‌పూర్‌లో మొత్తం 14 చండీపురా వైరస్ కేసులు నమోదయ్యాయని, అందులో ఏడుగురు రోగులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
"చండీపురా వైరస్ కు సంబంధించి మూడు కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చాయి. మొత్తం రాష్ట్రంలో 50 చండీపురా వైరస్ కేసులు నమోదయ్యాయి. 16 మంది ప్రాణాలు కోల్పోయారు" అని రుషికేష్ పటేల్ తెలిపారు. ఈ వైరస్ కు సంబంధించి ప్రతి గ్రామం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే కలెక్టర్లు, చీఫ్ డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ (CDHO), మెడికల్ కాలేజీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశాలు నిర్వహించారు. "గుజరాత్‌లో, చండీపురా వైరస్ లక్షణాలు పిల్లలలో కనుగొన్నా...