Krishnashtami 2024 | కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి? , శుభముహర్తం ఏమిటి?
Krishnashtami 2024 | ప్రపంచ వ్యాప్తంగా హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండగల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి ప్రధానమైనది. కృష్ణుడి పుట్టిన రోజును కృష్ణాష్టమి, గోకులాష్టమి అనే పేర్లతో కూడా పిలుస్తారు. విష్ణువు దశావతారాల్లో 8వ అవతారంగా ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడిగా జన్మించాడు. దేవకీ వసుదేవుల ఎనిమిదో సంతానంగా శ్రావణ మాసం కృష్ణ పక్షంలో అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించాడు. అందుకే ఈ తిథి రోజున ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ నేపధ్యంలో ఈ ఏడాది శ్రీ కృష్ణ జన్మాష్టమి ఏ రోజు వచ్చింది? పూజా శుభ ముహూర్తం ఎప్పుడు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సంవత్సరం జన్మాష్టమి ఆగస్టు 26, 2024న వస్తుంది. తెల్లవారుజామున 3:39 నుంచి ఆగస్టు 27న తెల్లవారుజామున 2:19 వరకు అష్టమి తిథితో ప్రారంభమమవుతుంది. శ్రీకృష్ణుని ...