Wednesday, April 16Welcome to Vandebhaarath

Tag: Kishan Reddy

Delhi Election Results | కాంగ్రెస్ పరిస్థితి చూస్తే జాలి క‌లుగుతోంది..
Elections

Delhi Election Results | కాంగ్రెస్ పరిస్థితి చూస్తే జాలి క‌లుగుతోంది..

కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిDelhi Election Results : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయం అందించిన ఢిల్లీ ప్రజలకు కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి (Kishan Reddy) ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే జాలి కలుగుతోంద‌ని, రాహుల్ గాంధీ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత, కాంగ్రెస్ ఓటములను కంప్యూటర్ ద్వారా లెక్కపెట్టాల్సిన దుస్థితి ఏర్పడింద‌ని సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) నాయకత్వంపై కాంగ్రెస్ కార్యకర్తల్లోనే న‌మ్మ‌కం లేద‌ని ఇక‌ దేశ ప్రజలు ఎలా విశ్వసిస్తారని అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ డబుల్ హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంద‌ని, 2014, 2019, 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పె...
దక్షిణ మధ్య రైల్వేలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.83,000 కోట్లు : మంత్రి కిషన్ రెడ్డి
Telangana

దక్షిణ మధ్య రైల్వేలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.83,000 కోట్లు : మంత్రి కిషన్ రెడ్డి

South Central Railway  | దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు 83,000 కోట్లు కేటాయించిన‌ట్లు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. సికింద్రాబాద్ రైల్ నియంలో గురువారం జ‌రిగిన‌ సమావేశంలో కేంద్ర మంత్రి, SCR జోన్ పరిధిలోని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 10 మంది ఎంపీలు పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే ప‌రిధిలో చేపడుతున్న పలు అభివృద్ధి పనుల‌పై రైల్వే అధి కారులుతో ఎంపీలు చర్చించారు. స‌మావేశం అనంత‌రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రైళ్ల హాల్టింగ్, కొత్త రైల్వే లైన్లు,రైల్వే అండర్ బ్రిడ్జీలు, అండర్ సాస్ వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యులు వారి వారి నియోజకవర్గాల పరిధిలో రైల్వే సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ... దక్షిణ మధ్య రైల్వే ప...
Yadadri MMTS | వరంగల్‌లో రూ.650 కోట్లతో రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్..  త్వరలో యాదాద్రికి ఎంఎంటీఎస్ రైళ్లు..
Telangana

Yadadri MMTS | వరంగల్‌లో రూ.650 కోట్లతో రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్.. త్వరలో యాదాద్రికి ఎంఎంటీఎస్ రైళ్లు..

Yadadri MMTS | వరంగల్‌లో త్వరలో రూ.650 కోట్లతో రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రైల్వే వ్యాగన్లు, కోచ్‌లు, ఇంజన్లు తయారు చేయాలనేదే ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. అలాగే గ్రేటర్ పరిధిలోని ఎంఎంటీఎస్ సేవలను యాదాద్రి వరకు పొడిగించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, కర్ణాటక ఎంపీలతో సమావేశమైయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తోపాటు రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి, ఎంపీలు కావ్య, రఘనందన్ రావు, డీకే అరుణ లు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో పాల్గొన్న‌ ఎంపీలు వారి నియోకవర్గాల పరిధిలో జరుగుతున్న రైల్వే పనులు, చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టుల‌పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ద‌క్...
Kishan Reddy | పేద‌ల ఇళ్ల‌ను కూల్చివేస్తే ఊరుకోం.. దమ్ముంటే ఓవైసీ ఫాతిమా కాలేజీని కూల్చండి.
Telangana

Kishan Reddy | పేద‌ల ఇళ్ల‌ను కూల్చివేస్తే ఊరుకోం.. దమ్ముంటే ఓవైసీ ఫాతిమా కాలేజీని కూల్చండి.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ Musi Beautification  | కాంగ్రెస్ స‌ర్కారు పేద‌ల ఇండ్ల‌ను అన్యాయంగా కూల్చివేస్తామంటే చూస్తూ ఊరుకోబోమ‌ని కేంద్ర‌మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు జి.కిష‌న్ రెడ్డి (kishan reddy) అన్నారు. బిజెపి (BJP) రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ‌న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చి 10 నెల‌లు కాక‌ముందే పేదల కాల‌నీపై కన్నేసి వారి ఇండ్లను కూల్చ‌డానికి కుట్ర ప‌న్నింద‌ని విమ‌ర్శించారు. ఇండ్ల కూల్చివేతల (Demolition ) తో నిరంకుశ ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించ‌డం సరికాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇలా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోక తప్పదన్నారు. ప్రజల ఆందోళనలు పరిగణనలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదేవిధంగా బ్యూటిఫికేషన్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసింద...
మూసీ బాధితుల కోసం రంగంలోకి  బిజెపి.. నేటి నుంచి యాక్షన్ ప్లాన్..
Telangana

మూసీ బాధితుల కోసం రంగంలోకి  బిజెపి.. నేటి నుంచి యాక్షన్ ప్లాన్..

Hyderabad | హైడ్రా (Hydra), మూసీ కూల్చివేతల విషయంలో బాధితులకు అండగా నిలిచేందుకు  బీజేపీ రంగంలోకి దిగింది.  దీనిపై ఈరోజు కార్యాచరణ ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి (Kishan Reddy) వెల్లడించారు. మూసీ (Musi) సుందరీకరణలో భాగంగా  బాధితులైనవారి తరఫున  తమ పోరాటం ఉంటుందని తెలిపారు. బుధవారం మూసీ పరీవాహక ప్రాంతాల్లో బుధవారం కిషన్‌ ‌రెడ్డి పర్యటించారు. అంబర్‌పేట్‌, అసెంబ్లీ, ముసారాంబాగ్‌, అం‌బేడ్కర్‌ ‌నగర్‌, ‌తులసి నగర్ ‌మీదుగా కృష్ణానగర్‌ లో ఆయన పర్యటించి బాధితులతో మాట్లాడారు.ఈ సందర్భంగా మూసీ నిర్వాసితులు కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ఎదుట తమ కష్టాలను వివరించారు. ఇళ్లు కోల్పోతే రోడ్డున పడతామని కన్నీళ్ల పర్యంతమ‌య్యారు. మీరే దిక్కంటూ బోరున విలపించారు. ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, తమను ఇక్కడ్నుంచి పంపించవద్దంటూ  కోరారు. ఎన్నో డబ్బులు ఖర్చు చేసి ఇళ్లు కట్టుకున్నామని,...
సికింద్రాబాద్ స్టేషన్, చర్లపల్లి టెర్మినల్ వరకు రోడ్ల విస్తరణకు సహకరించండి..
Telangana

సికింద్రాబాద్ స్టేషన్, చర్లపల్లి టెర్మినల్ వరకు రోడ్ల విస్తరణకు సహకరించండి..

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ , చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు వెళ్లే రహదారుల విస్తరణకు సహకరించాలని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి (Kishan Reddy) ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని కోరారు.నగర శివార్లలోని చెర్లపల్లిలో రూ.415 కోట్ల వ్యయంతో కొత్త రైల్వే టెర్మినల్‌ నిర్మాణం పూర్తిచేస్తున్నట్లు సోమవారం ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కిషన్‌రెడ్డి తెలియజేశారు.. ఈ టెర్మినల్ హైదరాబాద్‌కు ప్యాసింజర్, గూడ్స్ రైళ్ల రాక పోకలకు కేంద్రంగా ఉంటుందని, అందువల్ల, అటువంటి ముఖ్యమైన రైల్వే టెర్మినల్‌కు చేరుకోవడానికి ఎఫ్‌సిఐ గోడౌన్ వైపు నుండి ప్రయాణీకుల ట్రాఫిక్ కోసం 100 అడుగుల రహదారి అవసరమని ఆయన అన్నారు. టెర్మినల్‌కు వెళ్లే రహదారి విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు.అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను రూ. 715 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన రైల్వే స్టేషన్‌ను వచ్చే ఏడాది చివర...
New Exrpress | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్ సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు
Telangana

New Exrpress | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్ సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) (Secunderabad to Goa Express) వరకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు (17039/17040)ను నడిపించ‌నున్న‌ట్లు ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే ప్రకటించింది.ఈ కొత్త రైలు సికింద్రాబాద్ నుంచి బుధ, శుక్రవారాల్లో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో వాస్కోడగామా నుంచి గురు, శనివారాల్లో ప్రారంభమవుతుంది. కాచిగూడ, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, గద్వాల్‌, కర్నూలు సిటీ, గుంతకల్‌, బళ్లారి, హోసపేట, కొప్పల్‌, గడగ్‌, హుబ్బళ్లి, ధార్వాడ్‌, లోండా, క్యాజిల్‌ రాక్‌, కుళెం, సాన్‌వోర్డెం, మడ్‌గావ్‌ రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.ప్రస్తుతం, సికింద్రాబాద్ నుండి 10 కోచ్‌లతో వీక్లీ రైలు బయలుదేరి గుంతకల్ (ఆంధ్రప్రదేశ్) చేరుకుంటుంది. గుంతకల్ వద్ద, తిరుపతి నుండి మరో 10 కోచ్‌లను జోడించి, గో...
Ayodhya Direct Flight : హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ ఫ్లైట్
Telangana

Ayodhya Direct Flight : హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ ఫ్లైట్

Ayodhya Flight: అయోధ్యకు వెళ్లే భక్తులకు శుభ‌వార్త. హైదరాబాద్ నుంచి రామ‌జ‌న్మ‌భూమి అయోధ్య‌కు వెళ్లేందుకు ఇప్ప‌టికే రైలు స‌ర్వీసులు చాలా అందుబాటులోకి వ‌చ్చాయి.అయితే త్వ‌ర‌లో నేరుగా ఫ్లైట్ లో వెళ్లేందుకు విమాన సర్వీసు కూడా అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 2 నుంచి ఈ విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు.Hyderabad To Ayodhya Direct Flight: అయోధ్య రామయ్య భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపిక‌బురు చెప్పింది. శ్రీరాముడి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్ర‌యం నుంచి నుంచి ప్రత్యేక విమాన సర్వీసుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైద‌రాబాద్‌ నుంచి అయోధ్యకు (Ayodhya) డైరెక్ట్ విమాన సేవలను ప్ర‌వేశ‌పెట్టనున్నామ‌ని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ‌ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆదివారం వెల్ల‌డించారు. అయోధ్యకు విమాన సర్వీసు ప్రారంభించాలని.. కేంద్ర ప...