PM KISAN Scheme : జూన్ 18న వారణాసిలో పీఎం కిసాన్ పథకం కింద రూ.20,000 కోట్లు విడుదల
PM KISAN Scheme : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 20,000 కోట్ల నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విడుదల చేయనున్నారు. ఈనెల 18న వారణాసిలో PM-KISAN పథకానికి సంబంధించి 17వ విడత విడుదలతోపాటు 30,000 స్వయం సహాయక బృందాలకు ప్రధాని మోదీ సర్టిఫికేట్‌లను కూడా అందజేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ జూన్ 10న సుమారు 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు రూ. 20,000 కోట్లను పంపిణీ చేసే లక్ష్యంతో పీఎం-కిసాన్ పథకం 17వ విడత నిధుల విడుదలకు తొలి సంతకం చేశారు.
ఫిబ్రవరి 2019లో PM KISAN Scheme ను ప్రారంభించారు. ఈ స్కీం లో చేరిన రైతులకు ఏడాదికి రూ. 6,000 పెట్టుబడి సాయాన్ని రూ. 2,000 చొప్పున మూడు వాయిదాల్లో నేరుగా రైతుల ఆధార్-లింక్డ్ బ్యాంక్...