Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త, శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Sabarimala Special Trains: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తుతున్నారు. సంక్రాంతి వరకూ భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ సమయంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళలో రైళ్లు కిటకిటలాడుతుంటాయి.
టికెట్ రిజర్వేషన్ కూడా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే ఏకంగా 26 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్పెషల్ ట్రైన్స్.. ఎప్పటి నుంచి, ఎక్కడి నుంచి అందుబాటులో ఓసారి పరిశీలించండి..
శబరిమల అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 26 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.ఈ 26 రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ మధ్య రాకపోకలు సాగించనున్నాయి. ఈ రైళ్లు నవంబర్ 18, 20, 22, 24, 25, 27, 29వ తేదీల్లోనూ తిరిగి డిసెంబర్ 1, 2, 4, 6, 8, 9, 11, 13, 15, 16, 18, 20, 22, 23, 25, 27, 29, 30, జనవరి 1వ తేదీల్లో నడవనున్నాయి.
శబరిమలకు ప్రత్యేక రైళ...